LOADING...
Justin Trudeau: గ్లోబల్ పాప్ స్టార్‌తో డిన్నర్ డేట్‌కి వెళ్లిన కెనడా మాజీ ప్రధాని
గ్లోబల్ పాప్ స్టార్‌తో డిన్నర్ డేట్‌కి వెళ్లిన కెనడా మాజీ ప్రధాని

Justin Trudeau: గ్లోబల్ పాప్ స్టార్‌తో డిన్నర్ డేట్‌కి వెళ్లిన కెనడా మాజీ ప్రధాని

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2025
11:16 am

ఈ వార్తాకథనం ఏంటి

గ్లోబల్ పాప్‌ ఐకాన్ కేటీ పెర్రీతో కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో డిన్నర్‌కు వెళ్లిన ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ విషయమై అనేక అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కెనడా ప్రధాని పదవికి ట్రూడో ఈ ఏడాది జనవరిలోనే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామా అనంతరం అతడు చాలా అరుదుగా ప్రజల్లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం కేటీ పెర్రీ తన తాజా ఆల్బమ్ "143" ప్రమోషన్లలో భాగంగా కెనడా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ట్రూడో, పెర్రీ మాంట్రియల్ నగరంలోని ఓ ప్రైవేట్ రెస్టారెంట్‌లో కలిసి డిన్నర్ చేసినట్టు సమాచారం. వారిద్దరూ ప్రైవేట్ కార్నర్ టేబుల్ వద్ద కూర్చొని భోజనం చేయగా,ట్రూడో భద్రతా బృందం కూడా అక్కడే ఉందని తెలుస్తోంది.

వివరాలు 

జస్టిన్ ట్రూడో, భార్య సోఫీ గ్రెగోయిర్‌తో 2023లో విడిపోయారు  

డిన్నర్ అనంతరం వారు కొంతసేపు పరస్పరం చర్చలు సాగించారు.అనంతరం రెస్టారెంట్‌లోని కిచెన్‌ను సందర్శించి,అక్కడ పనిచేసే సిబ్బందికి వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలిపారు. వీరిద్దరూ కలిసి మాట్లాడుకుంటున్న దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. దాంతో ట్రూడో-పెర్రీల మధ్య డేటింగ్ సాగుతోందని ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. జస్టిన్ ట్రూడో తన భార్య సోఫీ గ్రెగోయిర్‌తో 2023లో విడిపోయిన సంగతి తెలిసిందే. సుమారు 18ఏళ్ల వివాహ జీవితం తర్వాత విడిపోతున్నట్టు వీరిద్దరూ సోషల్ మీడియాలో ప్రకటించారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అదే సమయంలో, కేటీ పెర్రీ కూడా ఈ ఏడాది ప్రారంభంలో నటుడు ఓర్లాండ్ బ్లూమ్‌తో విడిపోయారు. వారికి కూడా ఒక కుమార్తె ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గ్లోబల్ పాప్ స్టార్‌తో డిన్నర్ డేట్‌కి వెళ్లిన కెనడా మాజీ ప్రధాని