
Kenya plane collision: గాల్లో రెండు విమానాలు ఢీ.. ఇద్దరు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
కెన్యాలోని నైరోబీ నేషనల్ పార్క్ పైన మంగళవారం గాల్లో రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించినట్లు పోలీసులు తెలిపారు.
విల్సన్ విమానాశ్రయం నుంచి 'డాష్ 8' విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే.. అప్పుడే గాల్లో చక్కర్లు కొడుతున్న చిన్న పాటి శిక్షణ విమానం సింగిల్-ఇంజిన్ సెస్నా-172ను ఢీకొట్టింది.
ఈ ఘటనలో సెస్నా-172 నైరోబీ నేషనల్ పార్కులో కుప్పకూలిపోయింది. అందులో ఉన్న ఇద్దరు మరణించినట్లు పోలీసులు తెలిపారు.
ఢీకొన్న పెద్ద విమానాన్ని సఫారిలింక్ ఏవియేషన్ ఎయిర్‌లైన్ నిర్వహిస్తున్న డాష్ 8గా గుర్తించారు.
ఇది 44మంది ప్రయాణికులతో తీరప్రాంత రిసార్ట్ పట్టణం డయానికి వెళుతోంది.
ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్తగా డాష్ 8గా విమానాన్ని సురక్షింతగా విల్సన్ విమానాశ్రయానికి మళ్లించి ల్యాండింగ్ చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదం
$TSLA $SPY $SONG 2 people were killed in a midair plane collision in Kenya, police say: A Safarilink Aviation Dash 8 collided with a smaller plane operated by a flying school above Nairobi National Park on Tuesday, per The Associated… https://t.co/AJtDSxhsZ3 $QQQ $AAPL $BTC pic.twitter.com/26l15ZpGEI
— Music Licensing (@OTC_SONG) March 5, 2024