
Israel-Hamas: ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ కీలక నేత సలాహ్ అల్-బర్దావీల్ హతం
ఈ వార్తాకథనం ఏంటి
గాజా (Gaza)పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హమాస్ (Hamas) స్థావరాలను లక్ష్యంగా చేసుకుని టెల్‌అవీవ్ తీవ్ర దాడులకు దిగుతోంది.
తాజాగా జరిగిన వైమానిక దాడుల్లో హమాస్ రాజకీయ నేత సలాహ్ అల్-బర్దావీల్ (Salah al-Bardaweel) మృతి చెందినట్లు సంస్థ అధికారికంగా ధ్రువీకరించింది.
పాలస్తీనా మీడియా కథనం ప్రకారం, ఈ దాడుల్లో బర్దావీల్‌తో పాటు అతడి భార్య కూడా ప్రాణాలు కోల్పోయారు. హమాస్ మీడియా సలహాదారు తాహెర్ అల్-నోనో సోషల్ మీడియాలో ఈ ఘటనను ధృవీకరించారు.
బర్దావీల్ దంపతులు తమ స్థావరంలో ప్రార్థనలు చేస్తుండగా ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడిలో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
Details
ఒసామా తబాష్ హతం
ఇజ్రాయెల్ సైన్యం గత శుక్రవారం హమాస్ మిలిటరీ ఇంటెలిజెన్స్ అధిపతి ఒసామా తబాష్‌ను హతమార్చినట్లు వెల్లడించింది.
ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించిన హమాస్.. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
లెబనాన్‌లో కూడా ఉద్రిక్తత
ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కూడా ఉల్లంఘనకు గురైంది. శనివారం లెబనాన్ నుంచి ఆరు రాకెట్లు ఇజ్రాయెల్ భూభాగాన్ని తాకాయి.
ప్రతిగా ఐడీఎఫ్ దక్షిణ లెబనాన్‌పై బాంబు దాడులు చేసింది. ఈ దాడుల్లో ముగ్గురు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు.
గాజాపై ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన భారీ దాడుల్లో 400 మందికి పైగా మరణించారు. వీరిలో అధికంగా చిన్నారులు, మహిళలే ఉన్నారు. గురువారం జరిగిన దాడుల్లో 85 మంది ప్రాణాలు కోల్పోయారు.