North Korea: ఉత్తర కొరియాలో విషాదం.. ఆ దేశ ప్రముఖ వ్యక్తి కిమ్ కీ నామ్ మృతి
ఉత్తర కొరియాలో విషాదం చోటుచేసుకుంది. ఆ దేశ ప్రముఖ వ్యక్తి "కిమ్ కీ నామ్"(94) మంగళవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ బుధవారం వెల్లడించింది. అతను వృద్ధాప్యం వల్ల శరీరంలోని అన్ని అవయవాలు పనిచేయకపోవడం" కారణంగా మరణించినట్లు అధికారిక KCNA తెలిపింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, అతని కుటుంబ సభ్యులు బుధవారం తెల్లవారుజామున ఆయన అంత్యక్రియలకు హాజరై నివాళులు అర్పించారు. కిమ్ కి నామ్ 2009లో దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ డే-జంగ్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు. అలాగే దక్షిణ కొరియాను సందర్శించిన కొద్దిమంది ఉత్తర కొరియా అధికారులలో కిమ్ కి నామ్ ఒకరు.
ప్యోంగ్యాంగ్ ప్రచార, ఆందోళన విభాగానికి డిప్యూటీ డైరెక్టర్
దక్షిణ కొరియా ప్రభుత్వం తెలిపిన సమాచారం ప్రకారం.. 1966లో ప్యోంగ్యాంగ్ ప్రచార, ఆందోళన విభాగానికి డిప్యూటీ డైరెక్టర్‌గా నియమించబడ్డాడు. కిమ్ కి నామ్ ఉత్తరకొరియాలో మూడు తరాలపాటు రాజకీయనాయకుడిగా సేవలందించారు. అతను రాష్ట్ర రాజకీయ చట్టబద్దతో పాటు, మీడియా, ప్రచురణ కార్యకలాపాలపై నాయకత్వం వహించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడుతూ.. ఉత్తర కొరియా పాలనకు అపరిమితంగా విధేయత చూపిన అనుభవజ్ఞుడైన విప్లవకారుడిగా.. చివరి వరకు దేశానికి అత్యంత విధేయుడుగా పనిచేశాడాని తెలిపాడు.