Page Loader
Kolkata Dancer: అమెరికాలో కోల్‌కతా డాన్సర్ దారుణ హత్య.. ఈవెనింగ్ వాక్ చేస్తుండగా ఘటన 
అమెరికాలో కోల్‌కతా డాన్సర్ దారుణ హత్య.. ఈవెనింగ్ వాక్ చేస్తుండగా ఘటన

Kolkata Dancer: అమెరికాలో కోల్‌కతా డాన్సర్ దారుణ హత్య.. ఈవెనింగ్ వాక్ చేస్తుండగా ఘటన 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 02, 2024
02:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోల్‌కతాకు చెందిన అమర్‌నాథ్ ఘోష్ అనే భరతనాట్య,కూచిపూడి కళాకారుడు అమెరికాలో దారుణ హత్యకు గురయ్యారు. సెయింట్ లూయిస్‌లో ఈవెనింగ్ వాక్ చేస్తున్న ఆయన పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపడంతో మరణించారు. ఈ విషయాన్నిఅయన స్నేహితురాలు, టీవీ నటి దేవోలీనా భట్టాచార్జీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. అమర్‌నాథ్ ఘోష్ మృతదేహాన్ని తరలించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సహాయం అందించాలని యుఎస్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని అభ్యర్థించింది.

Details 

ఘటనపై స్పందించిన భారత కాన్సులేట్ జనరల్

ఈ ఘటనపై చికాగోలోని భారత కాన్సులేట్ జనరల్ స్పందించింది. "మిస్సౌరీలోని సెయింట్ లూయిస్‌లో మరణించిన అమర్‌నాథ్ ఘోష్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపుతున్నాం. పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఫోరెన్సిక్ టీమ్ కూడా విచారణ చేపడుతోంది. వాళ్లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాం. అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నాం" అమర్‌నాథ్ సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో డాన్స్‌లో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చదువుతున్నాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దేవోలీనా భట్టాచార్జీ చేసిన ట్వీట్ 

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భారత కాన్సులేట్ జనరల్ చేసిన ట్వీట్