Saifullah Qasoori: ఇజ్రాయెల్‌కు మద్దతిస్తే విధ్వంసమే.. ముస్లిం దేశాలకు లష్కరే నేత హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
లష్కరే తోయిబా ఉప ప్రధాన నాయకుడు సైఫుల్లా కసూరి చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి. ఇజ్రాయెల్‌తో సంబంధాలను మెరుగుపర్చాలని ప్రయత్నిస్తున్న ముస్లిం దేశాలకు ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. ఇజ్రాయెల్‌ను అంగీకరించే దేశాలు, పాలకులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రకటించాడు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఆయన ప్రసంగం మధ్యప్రాచ్య రాజకీయ పరిణామాలపై కొత్త చర్చకు కారణమైంది. మధ్యప్రాచ్యంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిస్థితులు, అబ్రహం ఒప్పందాలపై జరుగుతున్న చర్చల మధ్య కసూరి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి వెనుక సైఫుల్లా కసూరి పాత్ర ఉందని భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్న నేపథ్యంలో ఆయన ప్రసంగం మరింత చర్చనీయాంశమైంది.
వివరాలు
ఇజ్రాయెల్‌కు 400 కి.మీ. దూరంలో పాక్ ఉందని కసూరి వ్యాఖ్య
"యూదుల దేశమైన ఇజ్రాయెల్‌ను ముస్లిం ప్రపంచం ఎప్పటికీ అంగీకరించదు. ఒకవేళ ఏ దేశం లేదా పాలకుడు ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తే, వారు పూర్తిగా నాశనమవుతారు" అని కసూరి తన ప్రసంగంలో హెచ్చరించాడు. ముస్లిం దేశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇజ్రాయెల్‌ను గుర్తించబోవని ఆయన స్పష్టం చేశాడు. తన ప్రసంగంలో పాకిస్థాన్, సౌదీ అరేబియా మధ్య 2025లో కుదిరిన రక్షణ ఒప్పందాన్ని కూడా ప్రస్తావించాడు. ఆ ఒప్పందాన్ని ఇజ్రాయెల్‌కు వ్యతిరేక శక్తిగా చూపించే ప్రయత్నం చేశాడు. గతంలో పాకిస్థాన్ నుంచి ఇజ్రాయెల్‌కు దూరం నాలుగు వేల కిలోమీటర్లు ఉండేదని, ఇప్పుడు పాకిస్థాన్ తన సాంకేతిక శక్తి, ఆయుధ సామర్థ్యాలతో ఇజ్రాయెల్‌కు కేవలం నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు కసూరి వ్యాఖ్యానించాడు.
వివరాలు
స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పడిన తర్వాతే ఇజ్రాయెల్ గుర్తింపు సాధ్యం
ఇస్లామిక్ ప్రపంచానికి పాకిస్థాన్ రక్షణ రంగంలో నాయకత్వం వహిస్తోందని, సౌదీ అరేబియా ఆధ్యాత్మిక, సిద్ధాంత పరమైన నాయకత్వాన్ని అందిస్తోందని ఆయన పేర్కొన్నాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన అబ్రహం ఒప్పందాల్లో చేరాలన్న పిలుపును పాకిస్థాన్ తిరస్కరించిన కొద్ది రోజులకే కసూరి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత పొందింది. స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పడిన తర్వాత మాత్రమే ఇజ్రాయెల్‌ను గుర్తించే అంశాన్ని పరిశీలిస్తామని ఇస్లామాబాద్ గతం నుంచే చెబుతోంది. దౌత్య సంబంధ అంశాలను లష్కరే తొయిబా వంటి ఉగ్రవాద సంస్థలు తమ భావజాల ప్రచారం కోసం ఉపయోగించుకుంటున్నాయని భారత భద్రతా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇస్లామిక్ ప్రపంచానికి తామే రక్షకులమనే భావన కల్పించే ప్రయత్నం చేస్తున్నట్లు భద్రతా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మధ్యప్రాచ్య రాజకీయాలపై కసూరి తీవ్ర వ్యాఖ్యలు
Sources in Pakistan claimed the Punjabi establishment is using its religious radical puppet to come out and save us from Abraham Accords
— Bilal Baloch (@bbfr74) May 27, 2026
Saifullah Kasuri, a puppet of the Pakistan Army and Deputy Chief of Lashkar-e-Taiba, has threatened the Chief of Army Staff Asim Munir and the… pic.twitter.com/coJsUIMrj7