Page Loader
Elon Musk: ఎక్స్‌ సామాజిక మాధ్యమాన్ని అణచివేసేందుకు కమలాహారిస్‌ వర్గం  ప్లాన్‌.. పత్రాలు లీక్
ఎక్స్‌ సామాజిక మాధ్యమాన్ని అణచివేసేందుకు కమలాహారిస్‌ వర్గం ప్లాన్‌

Elon Musk: ఎక్స్‌ సామాజిక మాధ్యమాన్ని అణచివేసేందుకు కమలాహారిస్‌ వర్గం  ప్లాన్‌.. పత్రాలు లీక్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2024
11:16 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ సామాజిక మాధ్యమం 'ఎక్స్‌'ను అణచివేయడానికి డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ సలహా బృందం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆమె బృందంలో బ్రిటన్‌కు చెందిన పొలిటికల్‌ ఆపరేటివ్‌ మోర్గాన్‌ మెక్‌స్వీనీ ఒకరు. అతడు 'సెంటర్‌ ఫర్‌ కౌంటరింగ్‌ డిజిటల్‌ హేట్‌' అనే సంస్థను నిర్వహిస్తున్నాడు,ఇది బ్రిటన్‌ ప్రధాని స్ట్రీమర్‌ లేబర్‌ పార్టీతో సన్నిహిత సంబంధాలున్నాయి. సీసీడీహెచ్‌ సంస్థకు సంబంధించిన పత్రాలను ది డిస్‌ఇన్ఫర్మేషన్‌ క్రానికల్‌ సంస్థ బహిర్గతం చేసింది. ఈ ఏడాది మార్చిలో రూపొందించిన పత్రాల్లో మస్క్‌కు చెందిన ట్విటర్‌ను ఎలా సమన్వయంగా అణచివేయాలనే ప్రణాళికలు పలు దశల్లో స్పష్టంగా చూపించబడ్డాయి. 'కిల్‌ మస్క్స్‌ ట్విటర్‌'పేరిట ఉన్న ఈ ప్రణాళికలో ఆర్థికంగా అస్థిరపర్చడం,వాణిజ్య ప్రకటనలు ఇచ్చేవారిని భయపెట్టడం వంటి అంశాలు ఉన్నాయి.

వివరాలు 

సీడీహెచ్‌ దాతలపై పోరాడుతాం: ఎలాన్‌ మస్క్‌

ఈ అంశాన్ని ఎక్స్‌కు చెందిన డెయిలీ న్యూస్‌ వేదికపై కూడా పంచుకొన్నారు. ఈ పరిణామాలపై ఎలాన్‌ మస్క్‌ స్పందిస్తూ, "ఇది అమెరికాలో క్రిమినల్‌ చట్టాలను ఉల్లంఘిస్తూ ఎన్నికల్లో జోక్యం చేసుకొనే అంశంలా ఉంది. సీసీడీహెచ్‌ దాని దాతలపై పోరాడుతాము" అని చెప్పారు. రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల తర్వాత టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ఆయనకు అండగా నిలిచారు.

వివరాలు 

ట్రంప్‌ సలహాదారునిగా మస్క్‌ 

తాను మద్దతు ఇవ్వడమే కాకుండా రిపబ్లికన్లు గెలిచేలా సహాయపడుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో మస్క్‌ డబ్బులు కూడా పంచుతున్నట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు, డెమోక్రటిక్‌ పార్టీ పాలనలో లోపాలను మస్క్‌ ఎత్తిచూపుతున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌ నిర్లక్ష్యపూరిత వైఖరితో మెక్సికో నుంచి అమెరికాకు అక్రమ వలసలు పెరుగుతున్నాయని బహిరంగంగా విమర్శించారు. విద్యుత్ వాహనాలు, ఆర్థిక విధానాల్లోనూ లోపాలున్నాయని చెప్పారు. మరోవైపు, తాను గెలిస్తే మస్క్‌ను తన సలహాదారుగా నియమించుకోవాలని ట్రంప్‌ కూడా ఉవ్విళ్లూరుతున్నారు.