Page Loader
Meloni: లిబరల్స్‌ కుట్రలు నడవవు.. ఇటలీ ప్రధాని మెలోనీ ఘాటు వ్యాఖ్యలు
లిబరల్స్‌ కుట్రలు నడవవు.. ఇటలీ ప్రధాని మెలోనీ ఘాటు వ్యాఖ్యలు

Meloni: లిబరల్స్‌ కుట్రలు నడవవు.. ఇటలీ ప్రధాని మెలోనీ ఘాటు వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 23, 2025
01:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిబరల్స్‌ కపటత్వంతో వ్యవహరిస్తున్నారని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తీవ్ర విమర్శలు చేశారు. డొనాల్డ్ ట్రంప్‌ విజయంపై వారు భయాందోళన చెందుతున్నారని ఎద్దేవా చేశారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్‌లో వర్చువల్‌గా ప్రసంగించిన మెలోని, ట్రంప్‌తో పాటు ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్‌లను ప్రశంసించారు. తానను భారత ప్రధాని నరేంద్ర మోదీని, ట్రంప్‌ను సంప్రదాయవాద నాయకులుగా పేర్కొంటూ.. వారి విజయాలను చూసి ఉదారవాదులు తట్టుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. 90వ దశకంలో బిల్ క్లింటన్, టోనీ బ్లెయిర్‌ల వంటి నేతలు గ్లోబల్‌ లెఫ్టిస్ట్‌ నెట్‌వర్క్‌ను నిర్మించినప్పుడు, లిబరల్స్‌ వారిని రాజనీతిజ్ఞులుగా గౌరవించారన్నారు. కానీ ఇప్పుడు మోదీ, ట్రంప్, తనను ప్రజాస్వామ్యానికి ముప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Details

సంప్రదాయవాద నాయకులనే ప్రజలు గెలిపిస్తారు

ఉదారవాదులు ఎంత బురద జల్లినా ప్రజలు వారిని నమ్మడం లేదని, సంప్రదాయవాద నాయకులనే గెలిపిస్తున్నారని మెలోని స్పష్టం చేశారు. అమెరికా అభివృద్ధి విషయంలో ట్రంప్‌ స్థిరంగా ఉన్నారని, ఎన్ని అంతర్జాతీయ ఒత్తిళ్లు వచ్చినప్పటికీ ప్రపంచ సంప్రదాయవాద నాయకులతో కలిసి ముందుకు సాగుతున్నారని ఆమె ప్రశంసించారు.