
Worlds Safest Country: ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాల జాబితా విడుదల! భారతదేశం ఏ స్థానంలో ఉందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోని అత్యంత సురక్షిత దేశాల జాబితాలో భారత్ కన్నా పాకిస్థాన్ మెరుగైన స్థానం పొందిన విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నంబియో సేఫ్టీ ఇండెక్స్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం,ప్రపంచ సురక్షిత దేశాల జాబితాలో భారత్‌కు 66వ స్థానం (భద్రతా స్కోర్: 55.7)లభించగా,పాకిస్థాన్ మాత్రం 65వ స్థానంలో(భద్రతా స్కోర్: 56.3) నిలిచింది. ఈ నంబియో భద్రతా సూచికలో మొత్తం 147 దేశాలను పరిశీలించి ర్యాంకులు కేటాయించారు. ఈ జాబితాలో ఫ్రాన్స్, స్పెయిన్ మధ్యనున్న పైరినీస్ పర్వతాల్లో ఉన్న చిన్న యూరోపియన్ దేశం అయిన అండోరా అత్యధిక 84.7 భద్రతా స్కోర్‌తో ప్రథమ స్థానంలో నిలిచింది.
వివరాలు
ఈసెక్యూరిటీ ఇండెక్స్ ర్యాంకింగ్స్‌లో ఇతర దేశాలు
ఆ తర్వాతి స్థానాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (84.5),ఖతార్ (84.2),తైవాన్ (82.9),ఒమన్ (81.7) లాంటి దేశాలు వరుసగా 2వ నుంచి 5వ స్థానాల వరకూ నిలిచాయి. ఈ టాప్ 5 దేశాల్లో మౌలిక సదుపాయాలు అత్యంత అభివృద్ధిగా ఉన్నాయని,ప్రజలకు జీవన ప్రమాణాలు చాలా మెరుగుగా ఉండేలా ఉన్నాయని నంబియో ఇండెక్స్ వెల్లడించింది. దేశాల్లోని భద్రతా పరిస్థితులు,నేరాల సంఖ్య, ప్రజల స్థిరమైన జీవన విధానాలు లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులు కేటాయించారు. ఈసెక్యూరిటీ ఇండెక్స్ ర్యాంకింగ్స్‌లో ఇతర ముఖ్యమైన దేశాలు ఇలా ఉన్నాయి: అమెరికా 89వ స్థానం,బ్రిటన్ 87వస్థానం,చైనా 15వ స్థానం,శ్రీలంక 59వ స్థానం,బంగ్లాదేశ్ 126వ స్థానం. అమోన్ అనే దేశం మాత్రం అత్యంత దిగువ స్థాయిలో 147వ స్థానంలో నిలిచింది.