Earthquake: లాస్ ఏంజిల్స్ భూకంపం.. 4.3 తీవ్రతతో భూకంపం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని కాలిఫోర్నియా,లాస్ ఏంజెల్స్ ప్రాంతంలో బుధవారం 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.
యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే(USGS)ప్రకారం బుధవారం మధ్యాహ్నం ఆరెంజ్ కౌంటీలో భూకంపం సంభవించిందని పేర్కొంది.
భూకంప కారణంగా పెద్దగా నష్టం జరగనప్పటికీ, దక్షిణ కాలిఫోర్నియాలో భూప్రకంపనలకు మాత్రం భవనాలు కుదుపులకు గురైనట్లు తెలుస్తోంది.
ప్రస్తుతానికి ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. మరోవైపు అధికారులు ప్రమాద నష్టంపై అంచనా వేస్తున్నారు.
Details
రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రత..
భూప్రకంపనలకు ప్రజలు భయాందోళనకు గురైయ్యారు. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ప్రిలిమినరీ రికార్డింగ్‌లు రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రతను నమోదు చేశాయి.
అనంతరం 2 పాయింట్లు పెరిగి మొత్తం 4.3గా నమోదైంది.
భూకంపం కేంద్రం శాంటా అనా పర్వతాలలో, కరోనాకు నైరుతి దిశలో దాదాపు 5.6 మైళ్ల దూరంలో, రివర్‌సైడ్, ఆరెంజ్ కౌంటీల మధ్య సరిహద్దుకు దగ్గరగా సంభవించినట్లుగా అధికారులు కనుగొన్నారు.