Page Loader
Emmanuel Macron: మాక్రాన్ కి క్రీడా మంత్రి ఘాటు ముద్దు.. వైరల్ అవుతున్న ఫొటో
మాక్రాన్ కి క్రీడా మంత్రి ఘాటు ముద్దు

Emmanuel Macron: మాక్రాన్ కి క్రీడా మంత్రి ఘాటు ముద్దు.. వైరల్ అవుతున్న ఫొటో

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 31, 2024
04:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

పారిస్‌ ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుకల సందర్భంగా ఓ మహిళా మంత్రి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్(46)ను ముద్దు పెట్టుకోడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం పారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభ వేడుకలో మాక్రాన్ తన క్రీడా మంత్రిని ముద్దాడాడు. ఈ సన్నిహిత ముద్దు చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు,ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో మాక్రాన్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతవారం పారిస్‌లోని సెన్‌ నదిపై ఒలింపిక్స్ 2024అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ఆరంభ వేడుకలలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో పాటు ఇతర దేశాల ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడా శాఖ మంత్రి ఎమిలీ కాస్టెరా ఫ్రాన్స్‌ అధ్యక్షుడిని కౌగలించుకొని ఆయన బుగ్గపై గాఢంగా ముద్దు పెట్టారు.

వివరాలు 

సామజిక మాధ్యమంలో వైరల్‌గా మారిన ఫొటో 

ఆ సమయంలో అక్కడే ఉన్న ఫ్రాన్స్ ప్రధానమంత్రి గాబ్రియల్‌ అట్టాల్‌ కాస్త ఇబ్బందిపడ్డారు. ఈ సన్నివేశాన్ని ఫ్రెంచ్‌ మ్యాగజైన్‌ మాడమ్‌ ఫిగారో క్లిక్‌ మనిపించింది. ఈ ఫోటో కి సంబదించి ఫ్రెంచ్‌ మ్యాగజైన్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. 'ఈ ముద్దు చాలా వింతగా ఉంది. బహుశా మంత్రి ఎమిలీ అందరి దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నారేమో' అంటూ రాసుకొచ్చింది. దీంతో సామజిక మాధ్యమంలో ఈ ఫొటో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో వీరిద్దరూ చాలా సన్నిహితంగా ఉన్నట్లు కన్పించడం వివాదానికి దారితీసింది. ఈ ఫోటోపై నెట్టింట తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద హోదాలో ఉన్న వ్యక్తులు ఓ గొప్ప ఈవెంట్ లో ఇలా అనుచితంగా ప్రవర్తించడం సరికాదంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.

వివరాలు 

 సెన్‌ నదిలో స్విమ్మింగ్‌ చేసిన ఎమిలీ

కాగా.. క్రీడా శాఖ మంత్రి ఎమిలీ ఒలింపిక్స్‌ ప్రారంభానికి ముందు సెన్‌ నదిలో స్విమ్మింగ్‌ కూడా చేశారు. నది చాలా క్లీన్ గా ఉందని చాటి చెప్పేందుకు ఈ ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అందులో నీటి నాణ్యతపై ఇంకా ఆందోళనలు తొలగిపోలేదు. నదిలో నిర్వహించాల్సిన కొన్ని పోటీలను వాయిదా వేయడం గమనార్హం.