తదుపరి వార్తా కథనం

Japan Earthquake: జపాన్‌లో 6.0 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికల్లేవ్
వ్రాసిన వారు
Sirish Praharaju
Jan 09, 2024
03:51 pm
ఈ వార్తాకథనం ఏంటి
జపాన్ లో మళ్లీ భూకంపం సంభవించింది. మంగళవారం రిక్టర్ స్కేల్‌పై 6.0 తీవ్రతతో భూకంపం సెంట్రల్ జపాన్‌లోని నీగాటా ప్రిఫెక్చర్‌ను తాకింది.
అయితే ఇంకా సునామీ హెచ్చరిక ఇవ్వలేదని ప్రభుత్వం తెలిపింది.
గత వారం,న్యూ ఇయర్ రోజున జపాన్‌లో రిక్టర్ స్కేల్‌పై 7.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపంలో భారీ ప్రాణ,ఆస్తి నష్టం జరిగింది.
గత ఎనిమిదేళ్లలో జపాన్‌లో సంభవించిన ఘోరమైన భూకంపంలో ఇది ఒకటి. ఈ భూకంపం వల్ల కనీసం 100 మంది మరణించారు, 200 మందికి పైగా ప్రజల ఆచూకి ఇంకా తెలియరాలేదు.
హోకురికు ప్రాంతంలో 23,000 గృహాలకు ఇప్పటికీ విద్యుత్ లేదు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జపాన్‌లో 6.0 తీవ్రతతో భూకంపం
BREAKING ALERT - Magnitude 6.0 earthquake strikes off central Japanhttps://t.co/zHjVYObAze
— Insider Paper (@TheInsiderPaper) January 9, 2024