
Marco Ebben: యూరప్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మార్కో ఎబ్బెన్ కాల్చివేత
ఈ వార్తాకథనం ఏంటి
నెదర్లాండ్స్‌కు చెందిన డ్రగ్ ట్రాఫికర్,యూరోప్‌లో అత్యంత కావలసిన నేరస్థుడు, 32 ఏళ్ల మార్కో ఎబ్బెన్ (Marco Ebben) మెక్సికోలో హత్యకు గురయ్యాడు.
మెక్సికో రాజధాని సిటీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటిజాపన్ డీ జరగోజా మున్సిపాలిటీలో అతన్ని కాల్చి చంపినట్లు అధికారులు తెలిపారు.
గత సంవత్సరం అతను మరణించాడని ఫేక్ న్యూస్ ప్రచారం జరిగింది. అయితే, ఈసారి ఎబ్బెన్ నిజంగా హత్యకు గురైనట్లు పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
బ్రెజిల్ నుంచి నెదర్లాండ్స్‌కు డ్రగ్స్ సరఫరా చేసే క్రిమినల్స్‌లో మార్కో ఎబ్బెన్ అత్యంత కావలసిన నేరస్థుడిగా ఉన్నాడు.
యూరోపోల్ ఏజెన్సీ అతని కోసం చాలా కాలంగా గాలిస్తోంది. 2020 అక్టోబర్‌లో మార్కోకు ఏడేళ్ల జైలు శిక్ష విధించబడినట్లు యూరోపోల్ వెబ్‌సైట్ వెల్లడించింది.
వివరాలు
మార్కో 400 కిలోల కొకైన్‌ను స్మగ్లింగ్ చేసినట్లు ఆరోపణలు
2014 నుండి 2015 మధ్య కాలంలో, మార్కో దాదాపు 400 కిలోల కొకైన్‌ను స్మగ్లింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
పైనాపిళ్లతో నిండిన కంటైనర్ల ద్వారా అతను కొకైన్ తరలించినట్లు యూరోపోల్ తెలిపింది.
అరెస్టును తప్పించుకోవడానికి గత ఏడాది అక్టోబర్‌లో తాను చనిపోయినట్లు ఫేక్ వార్తలు సృష్టించాడు.
మెక్సికోలో రెండు డ్రగ్ ముఠాల మధ్య జరిగిన కాల్పుల్లో తాను మరణించినట్లు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశాడు.
వాస్తవానికి, అతనికి ఓ పెద్ద కార్టెల్‌తో సంబంధాలు ఉన్నప్పటికీ, ఆ సమయంలో అతని మృతదేహాన్ని గుర్తించలేదు.