Masood Azhar :2001 పార్లమెంట్ దాడి సూత్రధారి.. మసూద్ అజార్ కి గుండెపోటు..!
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్(జేఈఎం) చీఫ్ మౌలానా మసూద్ అజార్ గుండెపోటుకు గురైనట్లు సమాచారం అందుతోంది. పుల్వామా వంటి భారత్‌లో జరిగిన ఉగ్రదాడికి కీలక పాత్ర పోషించిన అజార్, ప్రస్తుతం ప్రపంచంలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఉన్నాడు. అతడి ఆరోగ్యం క్షీణించిన సందర్భంలో, అతను ఆఫ్ఘనిస్తాన్‌లో ఉండగా, చికిత్స కోసం పాకిస్తాన్‌కు తరలించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
పాకిస్తాన్‌లో ''జైషే మహ్మద్'' అనే ఉగ్రసంస్థ నెలకొల్పోయిన అజార్
1999లో భారతదేశానికి చెందిన ఇండియన్ ఎయిర్‌లైన్ విమానం IC-814ను ఖాట్మాండూ నుంచి న్యూఢిల్లీకి ప్రయాణిస్తున్న సమయంలో హైజాక్ చేసిన తరువాత, ఆ విమానాన్ని కాందహార్‌లోకి తీసుకెళ్లి, భారత్ మసూద్ అజార్‌ను విడుదల చేయాల్సి వచ్చింది. ఈ విడుదల తరువాత, అజార్ పాకిస్తాన్‌లో ''జైషే మహ్మద్'' అనే ఉగ్రసంస్థను స్థాపించాడు. ఈ ఉగ్రసంస్థ 2001లో భారత్ పార్లమెంట్‌పై దాడి చేస్తూ, 2016లో పఠాన్ కోట్ దాడి, 2019లో పుల్వామా దాడిలో ఇతడి ప్రమేయం ఉంది. భారత్, మసూద్ అజార్‌తో పాటు లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌ను కూడా ఉగ్రవాద నిరోధక చట్టం (UAPA) కింద 'వ్యక్తిగత ఉగ్రవాదులు'గా పేర్కొంది.