Hamas: హమాస్ మానవ కవచాల వినియోగం.. మండిపడ్డ పాలస్తీనా అథారిటీ
ఈ వార్తాకథనం ఏంటి
హమాస్ మానవ కవచాలను వాడుతోందని పాలస్తీనా అథారిటీ తీవ్రమైన ఆరోపణలు చేసింది. వెస్ట్‌బ్యాంక్‌లో హమాస్ కార్యకలాపాలను అసలు ఒప్పుకోమని పీఏ తేల్చిచెప్పింది.
ఈ ఆరోపణలను హమాస్ నాయకుడు అబ్దుల్ రహ్మాన్ షడిడ్ ఖండించారు. పాలస్తీనా అథారిటీ తమ సభ్యులను హత్య చేయడానికి ప్రయత్నిస్తోందని, దీనికి సంబంధించి టెలిగ్రామ్ ఛానెల్‌ల్లో ప్రకటన విడుదల చేశారు.
తుల్కార్మ్ గవర్నరేట్ వద్ద జరిగిన ఘటనను గుర్తుంచుకోండి. భద్రతా దళాలు హమాస్ వాహనంపై కాల్పులు జరిపి, అందులోని వారిని హత్య చేయాలని యత్నించాయి.
కొన్ని రోజుల్లోనే ఇది జరిగిన రెండో దాడి. వెస్ట్‌బ్యాంక్‌లో హమాస్ సభ్యులను లక్ష్యంగా చేసుకోవాలని పాలస్తీనా అథారిటీ సూత్రప్రాయంగా సూచనలు జారీ చేసిందని షడిడ్ ఆరోపించారు.
Details
19 మంది మరణానికి పాలస్తీనా అథారిటీనే కారణం
జెనిన్ శరణార్థి శిబిరంలో గత 38 రోజుల్లో జరిగిన ఘటనలను గుర్తు చేస్తూ, 19 మంది మరణానికి పాలస్తీనా అథారిటీనే కారణమని ఆయన విమర్శించారు.
ఇక ఫతా సంస్థ శనివారం రాత్రి ఓ ప్రకటనలో హమాస్‌ను వెస్ట్‌బ్యాంక్‌లోకి అనుమతించమని, గాజా నగరాన్ని నాశనం చేసి, ఇరాన్ కోసం ఇక్కడి ప్రజల ప్రయోజనాలను, ఆస్తులను హమాస్ తాకట్టు పెట్టిందన్నారు.
ఇజ్రాయెల్‌తో యుద్ధానికి కారణాలను హమాస్ ఇచ్చిందన్నారు. ప్రజలను మానవ కవచాలుగా ఉపయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, గాజాలో నెలకొన్న మానవీయ సంక్షోభానికి హమాస్ బాధ్యత వహించాలని పేర్కొంది.
ఫతా ప్రకటన ప్రకారం, హమాస్ కార్యకలాపాలు వెస్ట్‌బ్యాంక్‌లో ప్రారంభం కావడం ఇరాన్ విస్తరణకాంక్షలకు తోడ్పడటమేనని విమర్శించారు.