Page Loader
Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం.. స్థానిక రాజకీయ నేత అరెస్ట్‌
బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం.. స్థానిక రాజకీయ నేత అరెస్ట్‌

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం.. స్థానిక రాజకీయ నేత అరెస్ట్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 30, 2025
12:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లో ఒక హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. 21ఏళ్ల వయసున్న ఓ హిందూ యువతిపై స్థానిక రాజకీయ నాయకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈసంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది ముఖ్యంగా ఢాకా విశ్వవిద్యాలయం విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్డెక్కి నిరసనలు చేపట్టారు. బాధితురాలికి న్యాయం కల్పించాల్సిందిగా, నిందితులను వెంటనే శిక్షించాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు. ఈకేసులో ప్రధాన నిందితుడితో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం..ఈ ఘటన జూన్ 26న చోటు చేసుకుంది. ఖలీదా జియా నాయకత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP)కు చెందిన 38 ఏళ్ల ఫిరోజ్ అలీ అనే వ్యక్తి రాత్రి 10 గంటల సమయంలో ఒంటరిగా ఉన్న మహిళ ఇంటికి వెళ్లాడు.

వివరాలు 

ఫిరోజ్‌ అలీతో బాటు మరో ఐదుగురి అరెస్ట్ 

తలుపు తీయమని ఆమెను ఒత్తిడి చేయగా, ఆమె నిరాకరించడంతో అతను బలవంతంగా తలుపు తెరిపించి ఇంటిలోకి చొరబడి అమానుషంగా ప్రవర్తించాడు. ఆమె అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని ఫిరోజ్ అలీని పట్టుకున్నారు. స్థానికులు అతడిని కొట్టారు. దీంతో వారి నుంచి అలీ తప్పించుకుని పారిపోయాడు. ఈ దారుణంపై బాధితురాలు జూన్ 27న పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. మురాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ ఈ కేసును నమోదు చేసి, అదే రోజు ఉదయం 5 గంటల సమయంలో ఢాకాలోని సయదాబాద్‌ ప్రాంతంలో ఫిరోజ్‌ అలీని అరెస్టు చేశారు. అతనితో పాటు మరో ఐదుగురిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ అమానవీయ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

వివరాలు 

హిందూ మైనారిటీలపై దాడులు

నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డెక్కి పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. "డైరెక్ట్ యాక్షన్" తీసుకోవాలని నినాదాలు చేస్తూ ప్రభుత్వాన్ని ఉద్ధేశించి ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇక మరోవైపు, బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం అధికారం కోల్పోయినప్పటి నుంచి హిందూ మైనారిటీలపై దాడులు పెరిగాయని స్థానికంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.