8 మంది మాజీ భారత నేవీ అధికారులకు మరణశిక్ష విధించిన ఖతార్ కోర్టు
గత ఏడాది ఆగస్టులో ఖతార్ అధికారులు అరెస్టు చేసిన ఎనిమిది మంది మాజీ భారత నేవీ సిబ్బందికి మరణశిక్ష విధించారు. ఈ పరిణామంపై స్పందించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ఖతార్ తీర్పుపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. భారత్ ఈ విషయాన్ని ఖతార్ అధికారులతో చర్చిస్తోంది. గూఢచర్యం ఆరోపణలపై ఈ 8మంది అధికారులు జైలు పాలయ్యారు. ఈ విషయమై విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. మరణశిక్ష తీర్పుతో తాము తీవ్రంగా షాక్ అయ్యామని తెలిపింది.
అల్ దహ్రా కేసు ఏమిటి?
ఈ తీర్పుకి సంబంధించి పూర్తి సమాచారం కోసం ఎదురుచూస్తున్నాము. మేము వారి కుటుంబ సభ్యులు, న్యాయ బృందంతో టచ్ లో ఉన్నామని తెలిపింది. ఈ కేసుకు సంబంధించి అన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తున్నామని,అలాగే కేసుకు అధిక ప్రాధాన్యం ఇస్తూనే ప్రత్యకంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. ఈ కేసులో గోప్యతకు సంబంధించిన కారణాల దృష్ట్యా ప్రస్తుతం ఎక్కువగా వ్యాఖ్యానించలేమని తెలిపింది. 8 మంది భారత ఆర్మీ అధికారులు అల్ దహ్రా లో పనిచేస్తున్నారు.ఖతర్ సాయుధ దళాలకు శిక్షణ, ఇతర సేవలు అందించే ఈ సంస్థను ఒమన్‌కు చెందిన ఓ మాజీ వైమానిక దళం అధికారి నిర్వహిస్తున్నారు.
జైలు శిక్ష పడిన ఎనిమిది మంది భారతీయ ఆర్మీ అధికారులు వీరే
ఈ 8 మందిని ఖతర్ అధికారులు ఆగస్టు 2022 సబ్‌మెరైన్ కార్యక్రమాల్లో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో వీరిని నిర్బంధించినట్లు తెలిసింది. అల్ దహ్రా కేసులో జైలు శిక్ష పడిన ఎనిమిది మంది భారతీయ ఆర్మీ అధికారులు: కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సైలర్ రగేష్.