Trump- Zuckerberg: ట్రంప్ పారిపాలన నిధికి మెటా సంస్థ 1 మిలియన్ డాలర్ల విరాళం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) త్వరలో తన బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ పాలనకు ఏర్పాటు చేసిన సహాయ నిధికి భారీగా విరాళాలు అందుకుంటున్నాయి. తాజాగా, మెటా (Meta) సంస్థ ట్రంప్‌కు 1 మిలియన్ డాలర్లు (రూ.8,486 కోట్ల) విరాళంగా అందించేందుకు సన్నాహాలు చేస్తోందని తెలిసింది. ఈ వార్తలు అక్కడి మీడియాల్లో ప్రాచుర్యం పొందాయి. తాజాగా, అమెరికాకు ఎన్నికైన నూతన అధ్యక్షుడు ట్రంప్ తన నివాసంలో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg)తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇద్దరూ కలిసి విందు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ట్రంప్ ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై నిషేధం
ఈ నేపథ్యంలో, ట్రంప్‌కు ఇంత భారీ విరాళం అందించడం విశేషంగా పరిగణనలోకి వస్తుంది. అలాగే, జుకర్‌బర్గ్ ట్రంప్ ప్రభుత్వంలో తీసుకునే టెక్ విధానాలు తమ సంస్థకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటున్నట్లు సమాచారం. అందుకే అతను ఈ భారీ విరాళాన్ని ఇవ్వడం జరుగుతున్నట్లు ఒక వార్తా సంస్థ పేర్కొంది. 2021లో క్యాపిటల్ భవనంపై దాడి తర్వాత ట్రంప్ ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై నిషేధం విధించడమే కాకుండా, ఆ సమయంలో ఇద్దరి సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ, 2023లో వాటిని పునరుద్ధరించారు. అయితే, భవిష్యత్తులో ట్రంప్ మరింత ఉల్లంఘనలు చేస్తే జరిమానా విధిస్తామని మెటా ప్రకటించింది. అయితే, అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈ ఆంక్షలను తొలగించింది.
'నా జీవితంలో నేను చూసిన అత్యంత అరుదైన దృశ్యం ఇది': జుకర్‌బర్గ్
ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ ప్రసంగిస్తున్నప్పుడు ఓ యువకుడు కాల్పులు జరిపిన ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో ట్రంప్ కుడి చెవి పైభాగంలో ఒక తూటా దూసుకువెళ్లింది. రక్తమోడిన గాయంతో వేదిక నుంచి దిగుతున్న ఆయన, పిడికిలి బిగించి 'ఫైట్' (పోరాడండి) అని గట్టిగా నినదించారు. ఈ సన్నివేశంలో ఆయన వెనక అమెరికా జెండా కన్పించడంతో, ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోపై స్పందించిన జుకర్‌బర్గ్ 'నా జీవితంలో నేను చూసిన అత్యంత అరుదైన దృశ్యం ఇది. ఒక అమెరికన్‌గా, ఈ పోరాటం నన్ను భావోద్వేగానికి గురిచేసింది. అందుకేనేమో చాలామంది ట్రంప్‌ను ఇష్టపడతారు' అని అన్నారు. ఈ నేపథ్యంలో, వీరి మధ్య సంబంధాలు మరింత బలపడినట్లు తెలుస్తోంది.