Loading...
lord Miguel Angel Felix Gallardo: మెక్సికో డ్రగ్ మాఫియా 'గాడ్‌ఫాదర్' ఫెలిక్స్ గల్లార్డో కన్నుమూత
మెక్సికో డ్రగ్ మాఫియా 'గాడ్‌ఫాదర్' ఫెలిక్స్ గల్లార్డో కన్నుమూత

lord Miguel Angel Felix Gallardo: మెక్సికో డ్రగ్ మాఫియా 'గాడ్‌ఫాదర్' ఫెలిక్స్ గల్లార్డో కన్నుమూత

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 16, 2026
09:25 am

ఈ వార్తాకథనం ఏంటి

మెక్సికోలో ఆధునిక మాదకద్రవ్యాల సామ్రాజ్యాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించిన డ్రగ్ మాఫియా దిగ్గజం మిగెల్ ఏంజెల్ ఫెలిక్స్ గల్లార్డో (80) కన్నుమూశాడు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నఆయన.. గ్వాడలహారాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచాడు. అవయవాలు విఫలం కావడంతో మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ విషయాన్ని జాలిస్కో రాష్ట్ర భద్రతా అధికారులు ధ్రువీకరించారు. గ్వాడలహారా సమీపంలోని ప్యూంటె గ్రాండే జైలులో శిక్ష అనుభవిస్తున్న గల్లార్డో ఆరోగ్యం విషమించడంతో రెండు రోజుల క్రితం ఆసుపత్రికి తరలించారు. 1989లో అరెస్టయినప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నాడు. 'ఎల్ జెఫె డి జెఫెస్' (బాసులకే బాస్), 'ఎల్ పడ్రినో' (ది గాడ్‌ఫాదర్) అనే పేర్లతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందాడు.

వివరాలు 

కొకైన్ రవాణాలో కీలక పాత్ర

ఒకప్పుడు సాధారణ పోలీసు అధికారిగా జీవితాన్ని ప్రారంభించిన గల్లార్డో.. 1980వ దశకంలో గ్యాంగ్‌లార్డ్ కార్టెల్‌ను స్థాపించి డ్రగ్ మాఫియాలో తిరుగులేని శక్తిగా ఎదిగాడు.

కొలంబియాకు చెందిన పాబ్లో ఎస్కోబార్ మెడెలిన్ కార్టెల్ వంటి డ్రగ్ ముఠాలతో గల్లార్డో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాడు.

ఈ సంబంధాల ద్వారా కొకైన్ రవాణాలో తన ఆధిపత్యాన్ని విస్తరించాడు.

అమెరికాకు సరఫరా అయ్యే కొకైన్‌లో అధిక భాగాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడు.

డ్రగ్ వ్యాపారంతో పాటు అవినీతిని అస్త్రంగా చేసుకుని రాజకీయ, న్యాయ వ్యవస్థల్లోనూ తన పలుకుబడిని పెంచుకున్నాడు.

వివరాలు 

డీఈఏ ఏజెంట్ హత్యతో మొదలైన పతనం

1985లో అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ (డీఈఏ) ఏజెంట్ ఎన్రిక్ 'కికీ' కెమరెనాను కిడ్నాప్ చేసి, చిత్రహింసలకు గురిచేసి హత్య చేయడం గల్లార్డో పతనానికి ప్రధాన కారణమైంది.

ఈ ఘటన అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో అమెరికా, మెక్సికో ప్రభుత్వాలపై ఒత్తిడి పెరిగింది.

నిందితులను పట్టుకునేందుకు ఇరు దేశాల అధికారులు భారీ స్థాయిలో వేట ప్రారంభించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో 1989లో గల్లార్డోను అరెస్టు చేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఆయుధాల చట్టాల ఉల్లంఘన, డీఈఏ ఏజెంట్ కెమరెనా హత్య కేసుల్లో ఆయనకు సుదీర్ఘకాలం జైలు శిక్ష విధించారు.

అయితే కెమరెనా హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని గల్లార్డో చివరి వరకు వాదించాడు.

ADVERTISEMENT

వివరాలు 

గల్లార్డో అరెస్టుతో కొత్త కార్టెల్స్ ఆవిర్భావం

గల్లార్డో అరెస్టు తర్వాత గ్యాంగ్‌లార్డ్ కార్టెల్ విచ్ఛిన్నమైంది. ఆ తర్వాత దాని స్థానంలో సినలోవా కార్టెల్ సహా పలు కొత్త డ్రగ్ ముఠాలు పుట్టుకొచ్చాయి.

ఒకప్పుడు గల్లార్డో వద్ద పనిచేసిన జోక్విన్ 'ఎల్ చాపో' గుజ్మాన్.. ఆ తర్వాత సినలోవా కార్టెల్‌కు నాయకుడిగా ఎదిగాడు.

కొన్నేళ్లుగా గల్లార్డో ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో 2022లో అధికారులు ఆయనకు గృహ నిర్బంధంలో ఉండేందుకు అనుమతించారు.

అయితే ఆ తర్వాత మళ్లీ కట్టుదిట్టమైన భద్రత మధ్య జైలుకు తరలించారు.

తాజాగా ఆయన మరణంతో మెక్సికోలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా చరిత్రలో ఓ కీలక అధ్యాయం ముగిసినట్లయింది.

ADVERTISEMENT