USA: ట్రంప్ ఆఫర్ ఎఫెక్ట్.. 40,000 మందికి పైగా ఫెడరల్ కార్మికులు రాజీనామా
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగాల కోత విషయంలో ట్రంప్ సర్కారు వ్యూహం నెమ్మదిగా ఫలితాలు ఇవ్వడం మొదలు పెట్టింది.
గురువారం (అమెరికా కాలమానం ప్రకారం) ది ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్ (ఓపీఎం) నుండి ఇచ్చిన బైఅవుట్ ఆఫర్ గడువు ముగియనుంది.
ఈ సందర్భంగా ఇప్పటికే 40,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ పదవులకు రాజీనామా చేయడానికి అంగీకరించినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనంలో తెలిపింది.
ఈ విషయాన్ని ఓపీఎం ధ్రువీకరించింది. అయితే, ట్రంప్ సర్కారు ఊహించిన దానికంటే ఈ సంఖ్య చాలా తక్కువగా ఉందని, భవిష్యత్తులో ఈ సంఖ్య వేగంగా పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
వివరాలు
20 లక్షల మంది ఉద్యోగులకు ఈమెయిల్
ఓపీఎం నుండి ఒక మెమో విడుదలైంది. ఆ మేరకు, 20 లక్షల మంది ఉద్యోగులకు ఈమెయిల్ వెళ్లింది.
ఇందులో స్వచ్ఛందంగా ఉద్యోగాలు వదిలిన వారికి ఎనిమిది నెలల జీతం ఇస్తామని పేర్కొన్నారు.
ఫిబ్రవరి 6వ తేదీకి ముందు నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
దీనిని ఎంచుకున్న వారికి సెప్టెంబర్ వరకు పని చేయకుండానే జీతం పొందవచ్చని చెబుతుంటే, అయితే దానికి ఎలాంటి హామీ లేదని ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
వివరాలు
నాన్ ప్రాఫిట్ సంస్థలపై దీని ప్రభావం
సుమారు 10-15 శాతం మంది దీనిని ఎంచుకుంటారని ట్రంప్ సర్కారు భావించింది.
ఇది విజయవంతంగా అమలయితే, అమెరికా ప్రభుత్వ ఖర్చులు ఏటా 100 బిలియన్ డాలర్ల వరకు తగ్గవచ్చని అంచనా వేయబడింది.
మరోవైపు, ఫెడరల్ నిధులు, రుణాలు నిలిపివేయబడి ఉండగా ఈ వార్త వెలుగులోకి రావడం చర్చకు గురైంది.
చాలా స్థానిక ప్రభుత్వాలు, నాన్ ప్రాఫిట్ సంస్థలపై దీని ప్రభావం పడవచ్చని అంచనా వేయబడుతోంది.