Morocco earthquake: మొరాకో భూకంప ప్రమాదంలో 632కు చేరిన మరణాలు
ఉత్తరాఫ్రికా దేశమైన సెంట్రల్ మొరాకోలో శుక్రవారం ఉత్తరాఫ్రికాను కుదిపేసిన భయకరమైన భూకంపాలు ఇవేఅర్థరాత్రి 6.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. భూకంప ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మృతుల సంఖ్య 632 మందికి చేరినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. దాదాపు 300 మంది గాయపడినట్లు వెల్లడించింది. సహాయక సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. మొదట రాత్రి 11:11 గంటలకు భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. కొన్ని సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయి. మొదటి భూకంపం సంభవించిన 19 నిమిషాల తర్వాత 4.9 తీవ్రతతో మరో భూకంపం వచ్చినట్లు యుఎస్ ఏజెన్సీ తెలిపింది.
ఉత్తరాఫ్రికాను కుదిపేసిన భయకరమైన భూకంపాలు ఇవే
సాధారణంగా ఉత్తరాఫ్రికాలో భూకంపాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ప్రకంపనలు తక్కువగా వచ్చినా అవి భారీ స్థాయిలో వస్తుంటాయి. తీవ్రమైన నష్టాన్ని మిగులుస్తాయి. అవెంటో చూద్దాం. 2004లో ఈశాన్య మొరాకోలోని అల్ హోసీమాలో భూకంపం సంభవించినప్పుడు 628మంది మరణించారు. 926 మంది గాయపడ్డారు. 1960లో అగాదిర్‌లో 6.7తీవ్రతతో సంభవించిన భూకంపం 12,000మందికి పైగా చనిపోయారు. 1980లో పొరుగున ఉన్న అల్జీరియాలో 7.3 తీవ్రతతో సంభవించిన భూకంపం ప్రాంతీయంగా ఇటీవలి చరిత్రలో అత్యంత విధ్వంసకర భూకంపాలలో ఒకటిగా ఉంటుంది. ఈ భూకంప ప్రమాదంలో 2,500 మంది చనిపోయారు. కనీసం 300,000 మంది నిరాశ్రయులయ్యారు. తాజాగా సెంట్రల్ మొరాకోలో సంభవించిన భూకంకం కూడా అత్యంత తీవ్రమైనది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.