
Elon Musk: త్వరలో DOGE నుండి వైదొలగనున్న మస్క్.. సన్నిహితులు,కేబినెట్ తో ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ఒక కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఎలాన్ మస్క్ త్వరలో తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు సమాచారం.
మే చివరి లేదా జూన్ మొదటి వారంలో ఆయన ఈ పదవిని వీడే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ విషయాన్ని ట్రంప్ తన సన్నిహితులతో పాటు కేబినెట్ సభ్యులకు వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
అధ్యక్ష పదవిని చేపట్టిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ అనేక ప్రభుత్వ సంస్కరణలను అమలు చేశారు.
ఇందులో భాగంగా 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (DOGE)' పేరుతో ఓ విభాగాన్ని స్థాపించి, దానికి ఎలాన్ మస్క్‌ను నేతగా నియమించారు.
వివరాలు
మస్క్ కేవలం ట్రంప్ సలహాదారుడే..
ప్రభుత్వ వ్యవస్థలో అనవసర ఖర్చులను తగ్గించడం, సమర్థతను పెంచడం ప్రధాన లక్ష్యాలుగా ఉండగా, ఇందులో భాగంగా వేలాది ఉద్యోగాలను తొలగించే ప్రక్రియను కూడా ప్రారంభించారు.
అయితే, మస్క్ విధానాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ట్రంప్ ప్రభుత్వం వెనుక మస్క్ గూఢంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపించాయి.
దీనిపై వైట్ హౌస్ స్పందిస్తూ, మస్క్ DOGE ఉద్యోగి కాదని, ఆయనకు ఎటువంటి అధికారాలు లేవని స్పష్టం చేసింది.
మస్క్ కేవలం ట్రంప్ సలహాదారుడిగానే వ్యవహరిస్తున్నారని అధికారికంగా ప్రకటించింది.