
Nepal: నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేత..హోంమంత్రి రాజీనామా
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్ ఇప్పుడు అట్టుడుకుతోంది. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన సోషల్ మీడియా యాప్స్‌పై నిషేధానికి వ్యతిరేకంగా పెద్ద తరహా ఆందోళనలు మొదలయ్యాయి. ఈ ఉద్యమం ఇప్పుడు Gen-z పేరుతో అవినీతి వ్యతిరేక పోరాటంగా మారింది. ప్రధానమంత్రి కేపీ ఓలీ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. ప్రధానంగా సోషల్ మీడియా పై నిషేధాన్ని తీసివేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా నిషేధంపై ప్రారంభమైన ఆందోళనలలో జర్నలిస్టు సంఘాలు కూడా తమ మద్దతును ప్రకటించి ఆందోళన బాట పట్టాయి. ఆందోళన క్రమంగా పెరిగి, దేశ రాజధాని ఖాట్మండు సహా మొత్తం 10నగరాల్లో కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ Gen-Z ఆందోళనల కారణంగా ఇప్పటివరకు 20మంది ప్రాణాలు కోల్పోయారు,అలాగే 300 మందికి పైగా గాయపడ్డారు.
వివరాలు
యువత భారీ ఎత్తున Gen-Z పేరుతో నిరసనలు
ఈ నేపథ్యంలోనే నేపాల్ ప్రభుత్వం అత్యవసర భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని కేపీ ఓలీ నేతృత్వంలో ప్రభుత్వం సోషల మీడియా యాప్స్‌పై విధించిన నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేసింది. ఈ నిర్ణయం నేపాల్‌లో రాజకీయ చర్చలకు, ప్రజల మధ్య కలవరానికి దారి తీసింది. గతంలో, సామాజిక నిబంధనలు పాటించలేదని కారణంగా సోషల్ మీడియా యాప్స్‌పై ప్రభుత్వ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీనితో యువత భారీ ఎత్తున Gen-Z పేరుతో నిరసనలు చేపట్టారు. ముఖ్యంగా ఖాట్మండులో జరిగిన ఆందోళనల సమయంలో వేలాది మంది యువకులు పార్లమెంట్ భవనం చుట్టూ ముట్టడించగా, అక్కడ తీవ్ర హింస చెలరేగింది.
వివరాలు
నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామా
పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు 20 మంది మృతి చెందగా, 300 మందికి పైగా గాయాలయ్యాయి. అలాగే ఈ అల్లర్లకు బాధ్యత వహిస్తూ నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖను ప్రధాని కేపీ ఓలీకి అందజేసారు. ఇకపై, ప్రభుత్వ నిర్ణయంతో సోషల్ మీడియా నిషేధం పూర్తిగా రద్దు చేసినప్పటికీ.. ఆందోళనకారులు తలొగ్గడం లేదు.. ప్రధానమంత్రి ఓలీ రాజీనామా చేయాలని, వృద్ధ నాయకత్వానికి సమయం ముగిసిందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే నేపాల్ ప్రభుత్వం ఈ ఆందోళనల వెనుక విదేశీ కుట్ర ఉందని ఆరోపిస్తోంది.
వివరాలు
యువత ఆక్రోశం
కాగా.. నేపాల్ పార్లమెంట్ ప్రాంగణంలో యువత చేస్తున్న రచ్చ..కుర్రాళ్ల ఆక్రోశాన్ని చూసి పోలీసులే ఎదురెళ్లడానికి వణికిపోయారు.. ఒక్కసారిగా వేలాది మంది రావడంతో చేతులెత్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు, ప్రజాప్రతినిధుల కార్లను ధ్వంసం చేశారు. పోలీసు బారికేడ్లు, బాష్పవాయు, వాటర్ కెనాన్‌లను ఉపయోగించినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. వీరు దారి పొడుగునా ఉన్నా వాహనాలను ధ్వంసం చేయడం, ప్రభుత్వాస్థిని ప్రభుత్వాస్థిని ధ్వంసం చేశారు. పోలీసులే తమను తామే రక్షించుకోవడానికి ప్రయత్నించాల్సిన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో నేపాల్‌లో సుదీర్ఘ రాజకీయ సంక్షోభానికి మార్గం ఏర్పడింది.