
Nepal : నేపాల్'లో పార్లమెంట్ బిల్డింగ్, సుప్రీంకోర్టుకు నిప్పుపెట్టిన నిరసకారులు.. వైరల్ అవుతున్న వీడియోలు
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్‌లో పార్లమెంట్ భవనం మంటల్లో బూడితవుతోంది. దేశంలోని యువత తీవ్ర ఆందోళనలతో ముందుకు వచ్చి తీవ్ర నిరసనలు చేపట్టడంతో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పిపోయాయి. ఈ ఉదయం, ఖాఠ్మాండులోని పార్లమెంట్ బిల్డింగ్ వద్ద నిరసనకారులు దాడికి దిగి భవనానికి నిప్పుపెట్టారు. దీనివల్ల ప్రధానమంత్రి ఓలీ తక్షణమే రాజీనామా చేసి పారిపోయారు. ప్రజలలో సామాజిక మాధ్యమాలపై నిషేధం, ప్రభుత్వంలో పెరిగిపోతోన్న అవినీతి వంటి అంశాలపై అసంతృప్తి విపరీతంగా వ్యాపించి దేశవ్యాప్తంగా యువత ఆందోళనలకు దిగింది.
వివరాలు
సుప్రీంకోర్టుకు కూడా నిప్పు
ప్రధాన నగరాల్లో నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలు తీరా విధ్వంసాన్ని పుట్టించాయి. ఉప్పెనలా మారిన జనాన్నినియంత్రించడంలో భద్రతా దళాలు గట్టి సవాళ్లను ఎదుర్కొన్నారు. పోలీసులు చర్యలు చేపట్టినప్పటికీ నిరసనకారులు మరింత ఉధృతంగా రెచ్చిపోయారు. నేపాల్ రాజకీయ చరిత్రలో ఇదొక అత్యంత తీవ్ర స్థాయి ప్రజా పోరాటంగా నిలిచిపోయింది. ఈ ఆందోళనల నేపథ్యంలో అనేక మంది మంత్రులు ఇవాళ హెలికాప్టర్ల ద్వారా పరారీ అయ్యారు. నిరసనకారులు సుప్రీంకోర్టుకు కూడా నిప్పుపెట్టినట్లు తెలుస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కాలి బూడిదవుతున్న నేపాల్ పార్లమెంట్
Nepal’s parliament is on fire, marking a new beginning. #Nepal pic.twitter.com/nXbDgC7FG3
— trending Nepal (@trending_Nepal) September 9, 2025