Page Loader
నేపాల్ విమాన ప్రమాదం: చనిపోవడానికి ముందు ఫేస్‌బుక్ లైవ్, ఆ నలుగురూ స్నేహితులే!
నేపాల్ విమాన ప్రమాదంలో చనిపోవడానికి ముందు ఫేస్‌బుక్ లైవ్

నేపాల్ విమాన ప్రమాదం: చనిపోవడానికి ముందు ఫేస్‌బుక్ లైవ్, ఆ నలుగురూ స్నేహితులే!

వ్రాసిన వారు Stalin
Jan 16, 2023
01:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్ విమాన ప్రమాదానికి సంబంధించిన మరో వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. విమానంలో ఉన్న ఐదుగురు భారతీయుల్లో ఒకరు ఫేస్‌బుక్ లైవ్‌లో ఫ్లైట్ గ్లాస్ నుంచి అందాలను చూపించారు. అయితే ఆ లైవ్ ప్రారంభమైన సెకన్లకే విమానం కుప్పకూలి.. అందులో మంటలు చెలరేగాయి. ఈ దృశ్యాలు ఫేస్ బుక్ లైవ్‌లో రికార్డు అయ్యాయి. ఆ వీడియో తీసిన వ్యక్తిని యూపీకి చెందిన జైస్వాల్‌గా గుర్తించారు. జైస్వాల్‌ ఫేస్‌బుక్ ఖాతాలో 1:30 నిమిషాల పాటు లైవ్ రికార్డు అయ్యింది. ఆ వీడియోలో ప్రకృతి అందాలతో పాటు విమానంలోని ప్రయాణికులను చూపించడం కనిపిస్తుంది. అలాగే.. ఆ వీడియోలో 50సెకండ్ల వద్ద విమానం పక్కకి వంగడం.. కుప్పకూలడం క్షణాల్లో జరిగిపోయాయి.

నేపాల్

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆ నలుగురు స్నేహితులే

మృతులు నలుగురిని ఘాజీపూర్‌లోని బరేసర్‌కు చెందిన సోను జైస్వాల్ (29), అనిల్ రాజ్‌భర్ (28), విశాల్ శర్మ (23), అభిషేక్ సింగ్ కుష్వాహా (23)గా గుర్తించారు. వారం రోజలు పాటు నేపాల్‌లో టూర్ ప్లాన్ చేశారు. నలుగురు కలిసి శుక్రవారం ఖాట్మండులో దిగి పశుపతినాథ్ ఆలయంలో పూజలు చేసి.. పారాగ్లైడింగ్ కోసం పోఖారాకు వెళ్లారు. ఈ క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలు సోమవారం దిల్లీకి చేరుకుంటాయని భారత, నేపాల్ రాయబార కార్యాలయాల నుంచి తమకు సమాచారం అందించినట్లు కుష్వాహ అన్నయ్య అభినయ్ తెలిపారు. జైస్వాల్‌కు భార్య, ఒక పాప, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నేపాల్‌లో గతంలోనూ విమాన ప్రామాదాలు జరిగిన అనుభవాలు ఉన్నాయి.