LOADING...
Nepal: నేపాల్ ప్రధాన మంత్రి కెపి శర్మ ఓలి రాజీనామా 
నేపాల్ ప్రధాన మంత్రి కెపి శర్మ ఓలి రాజీనామా

Nepal: నేపాల్ ప్రధాన మంత్రి కెపి శర్మ ఓలి రాజీనామా 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 09, 2025
02:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్‌లో ప్రస్తుతం రాజకీయ సంక్షోభం ముదురుతోంది. సోషియల్‌ మీడియాపై విధించిన నిషేధం ఎత్తివేసినప్పటికీ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్లిష్ట సమయంలో నేపాల్‌ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ దేశ పాలన సైన్యం చేతుల్లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు వెలువడిన అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్‌తో చర్చించగా, ఈ క్లిష్ట పరిస్థితులను నియంత్రించేందుకు,తనను సురక్షితంగా ప్రభుత్వ నివాసం నుంచి తరలించేందుకు మిలిటరీ సహాయం కావాలని అడిగినట్లు తెలుస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నేపాల్ ప్రధాన మంత్రి కెపి శర్మ ఓలి రాజీనామా

వివరాలు 

ఆర్మీ బ్యారక్స్‌కు వీఐపీలు.. 

అంతేకాదు, ఆర్మీ చీఫ్ జనరల్ సిగ్దెల్ ప్రధాని ఓలీకి పదవికి రాజీనామా చేయాలని సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఘర్షణలను నియంత్రించడంలో సైన్యం ముందుకు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఓలీ రాజీనామా చేయడంతో పాటు మిలిటరీ రంగంలోకి దిగేందుకు ఆర్మీ సిద్ధంగా ఉందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ తరుణంలోనే రాజీనామా ప్రకటన వెలువడింది. అస్థిర పరిస్థితుల నేపథ్యంలో ప్రధాన విమానాశ్రయమైన త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేశారు. అన్ని విమానాలను రద్దు చేశారు. 300 మంది సైనికులను అక్కడ మోహరించారు. దేశ మంత్రులను వారి అధికారిక నివాసాల నుంచి ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా తరలిస్తున్నట్లు సమాచారం. ఎయిర్‌పోర్ట్ పరిధిలో హెలికాప్టర్ కదలికలు స్పష్టంగా కనబడుతున్నాయి.