
Nepal: నేపాల్ ఆర్థిక మంత్రిపై ఆందోళనకారుల దాడి.. కాలితో తన్ని, వీధుల్లో పరిగెత్తించారు!
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్‌లో అవినీతికి వ్యతిరేకంగా యువత ఆందోళనలు భారీ స్థాయిలో ఉధృతమయ్యాయి. ముఖ్యంగా మంత్రులు, అధికార పార్టీ నేతలనే లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతున్నారు. రాజధాని కాఠ్మాండూ సహా పలు ప్రధాన నగరాల్లోని మంత్రుల ఇండ్లకు, ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పెట్టారు. తాజాగా ఆ దేశ ఆర్థిక మంత్రి, డిప్యూటీ ప్రధాని బిష్ణు ప్రసాద్ పౌడేల్‌పై ఆందోళనకారులు తీవ్రంగా దాడి చేశారు. కాళ్లతో తన్ని, వీధుల్లో వెంబడించి కొట్టారు. ప్రాణభయంతో పారిపోవడానికి ప్రయత్నించినా, నిరసనకారులు వెంటాడి మరీ చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Details
దేశంలో రాజకీయ సంక్షోభం
అలాగే భక్తపూర్‌లోని ప్రధాని కేపీ శర్మ ఓలి ప్రైవేట్ నివాసంపై నిరసనకారులు దాడి చేసి దానికి నిప్పు పెట్టారు. అనంతరం అక్కడే డ్యాన్స్ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. యువత ఆందోళనల కారణంగా దేశంలో రాజకీయ సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చింది. నిరసనలు హింసాత్మకంగా మారడంతో నేపాలీ ప్రధాని కేపీ శర్మ ఓలి ఈ మధ్యాహ్నం తన పదవికి రాజీనామా చేశారు. సైన్యం సూచన మేరకు ఆయన పదవి నుంచి వైదొలగడం జరిగింది. పరిస్థితుల దృష్ట్యా దేశం విడిచి వెళ్లే పరిస్థితి ఆయనపై ఏర్పడింది. మరోవైపు ఇవాళ సాయంత్రం కొత్త ప్రధాని పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరలవుతున్న వీడియో
Nepal finance minister hetting flying kick #nomorecorruption #GenZProtest #genznepal pic.twitter.com/m4MuVmc6nF
— Manic (🍊,💊) (@WizardManic) September 9, 2025