LOADING...
Netanyahu: ఇజ్రాయెల్‌ పార్లమెంటు రద్దుకు విపక్షాల పట్టు.. కుప్పకూలనున్న నెతన్యాహు సర్కారు?
ఇజ్రాయెల్‌ పార్లమెంటు రద్దుకు విపక్షాల పట్టు.. కుప్పకూలనున్న నెతన్యాహు సర్కారు?

Netanyahu: ఇజ్రాయెల్‌ పార్లమెంటు రద్దుకు విపక్షాల పట్టు.. కుప్పకూలనున్న నెతన్యాహు సర్కారు?

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 12, 2025
08:41 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రస్తుతం తీవ్రమైన రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని ప్రభుత్వ పాలన ఓ పతనంకు చేరువవుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బుధవారం రోజున విపక్షాలు పార్లమెంట్‌ (నెసెట్‌)ను రద్దు చేయాలంటూ ప్రత్యేకంగా ఓ బిల్లును సమర్పించాయి. ఈ బిల్లుకు అధికార కూటమిలోని కొందరు భాగస్వామ్యపక్షాలు కూడా మద్దతు ప్రకటించాయి. దీంతో ఇజ్రాయెల్‌లో ముందస్తు ఎన్నికలు జరగడం ఖాయమని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే,దేశంలో సైనిక సేవలను తప్పనిసరిగా అందించాల్సిన నిబంధన నుండి మినహాయింపు కోరుతూ కొన్ని వర్గాలు ఉద్యమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత చట్టం ఆమోదం పొందకపోవడం వల్ల ఆ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి చెలరేగింది.

వివరాలు 

గాజాలో విషాదం: కాల్పుల్లో 38 మంది మృతి, 207 మందికి గాయాలు 

బుధవారం రాత్రి ఈ బిల్లుపై ఓటింగ్ జరగవచ్చని తెలుస్తోంది. విపక్షాలు ఆఖరి నిమిషంలో రాజీకి రాకపోతే ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొందితే కూడా కొత్త ఎన్నికల నిర్వహణకు కొన్ని వారాల సమయం పడనుంది. అదే ఈ బిల్లు తిరస్కరించబడితే, మరలా అలాంటి బిల్లును ప్రవేశపెట్టేందుకు కనీసం ఆరు నెలల సమయం ఎదురుచూడాల్సి ఉంటుంది. ఇక గాజాలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆహారం కోసం కొంతమంది ప్రజలు పోటీ పడ్డ సమయంలో జరిగిన కాల్పుల్లో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఈ ఘటనలో 207 మందికి పైగా గాయపడినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.