Page Loader
Netanyahu:ఇజ్రాయెల్ కంటే ఖమేనీకి ఇరాన్ ప్రజలు ఎక్కువ భయపడుతున్నారు: నెతన్యాహు 
ఇజ్రాయెల్ కంటే ఖమేనీకి ఇరాన్ ప్రజలు ఎక్కువ భయపడుతున్నారు: నెతన్యాహు

Netanyahu:ఇజ్రాయెల్ కంటే ఖమేనీకి ఇరాన్ ప్రజలు ఎక్కువ భయపడుతున్నారు: నెతన్యాహు 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2024
09:48 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన వేళ, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) టెహ్రాన్ ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) పాలనపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఖమేనీ పాలన ఇజ్రాయెల్‌కి కాకుండా, ఇరాన్‌ ప్రజలే ఎక్కువగా భయపడుతున్నారని నెతన్యాహు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక వీడియో విడుదల చేశారు.

వివరాలు 

బాలిస్టిక్‌ క్షిపణి దాడికి దాదాపు 2.3 బిలియన్‌ డాలర్లు

"కొన్ని వారాల క్రితం నేను ఇరాన్‌ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాను. ఆ తర్వాత, ఇరాన్‌ నుండి అనేక మంది మా దేశానికి చేరుకున్నారన్నారు. ఇటీవల జరిగిన బాలిస్టిక్‌ క్షిపణి దాడికి దాదాపు 2.3 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేశారు. ఇరాన్‌ ప్రభుత్వానికి ప్రజల నుండి మరిన్ని డాలర్లు దోచుకోవాలని చూస్తున్నారని అన్నారు. అయితే, ఈ దాడి మాకు పెద్ద నష్టాన్ని కలిగించలేదు. ఆ మొత్తాన్ని ఇరాన్‌ ప్రజల విద్య, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలపై ఖర్చు చేస్తే, వారి జీవనశైలి మెరుగుపడేది" అని నెతన్యాహు వ్యాఖ్యానించారు.

వివరాలు 

మీకు ఈ యుద్ధం వద్దని నాకు తెలుసు: నెతన్యాహు 

"ఖమేనీ తన క్రూరత్వాన్ని ప్రపంచానికి చాటాడు. అతను ఇరాన్‌ భవిష్యత్తు గురించి కాకుండా, ఇజ్రాయెల్‌ నాశనం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు. ఇక, మళ్లీ ఇరాన్‌ మాపై దాడి చేస్తే, అది వారి ఆర్థిక స్థితికి తీవ్ర నష్టాన్ని తలపెట్టే పరిణామాలను తీసుకువస్తుంది.మేము తదనుగుణంగా ప్రతిస్పందిస్తాం"అని ఆయన స్పష్టం చేశారు. "మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఆలోచించాలి. మేము మీకు అధునాతన ఆస్పత్రులు,మంచి విద్య,స్వచ్ఛమైన నీరు అందిస్తాం. మీకు ఈ యుద్ధం వద్దని నాకు తెలుసు. నాకూ ఈ యుద్ధం వద్దు. మీ ఆశలు కోల్పోవద్దు. ఇజ్రాయెల్‌తో పాటు, ప్రపంచంలో అనేక దేశాలు మీతో ఉన్నారు.ఏదో రోజు ఇరుదేశాల ప్రజలు కలిసి శాంతి ఏర్పరచగలిగే దిశగా నమ్మకం కలిగి ఉన్నాము"అని నెతన్యాహు చెప్పారు.

వివరాలు 

ఇరాన్‌ ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు

ఇటీవల, ఇరాన్‌ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో నెతన్యాహు, వారి దేశం వారికి మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఇరాన్‌ ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు చేశారు.