
Iran-Israel: ఇరాన్ అణు కేంద్రాలపై దాడికి ఇజ్రాయెల్ ప్లాన్: అమెరికా నిఘా వర్గాలు
ఈ వార్తాకథనం ఏంటి
అణ్వాయుధాల ఒప్పందం అంశంలో ఇరాన్‌తో మరోసారి ఒప్పందం కుదుర్చుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఈనేపథ్యంలో ఒక కీలక అంశం వెలుగులోకి వచ్చింది.ఇరాన్‌లోని అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సమాచారం.
అమెరికా గూఢచార విభాగానికి చెందిన అధికారులు ఈ విషయాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది.దీనిపై పలు ఆంగ్ల మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతుందనే సమాచారం తమకు అందిందని యూఎస్ అధికారుల పేర్కొంటున్నారు.
ఇలాంటి దాడులు చోటు చేసుకుంటే,ట్రంప్ చేపట్టిన దౌత్యపరమైన అణు ఒప్పంద ప్రయత్నాలకు విఘాతం కలగవచ్చని వారు వ్యాఖ్యానించారు.
అయితే, ఈ దాడులకు సంబంధించి ఇజ్రాయెల్ తుది నిర్ణయం తీసుకున్నదా లేదా అనే విషయం ఇప్పటికీ స్పష్టంగా తెలియదని వెల్లడించారు.
వివరాలు
అణు ఒప్పందం కుదరకపోతే సైనిక దాడి: ట్రంప్ హెచ్చరిక
దీనిపై ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి లేదా అమెరికాలోని టెల్‌అవీవ్ రాయబార కార్యాలయం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా అడ్డుకునేందుకు అమెరికా నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది.
ఈ క్రమంలోనే ట్రంప్ ఇటీవల న్యూక్లియర్ డీల్ పునరుద్ధరించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు.
ఈ విషయమై ఇటీవల ఒమన్‌లో ఉన్నత స్థాయి చర్చలు కూడా జరిగినట్లు సమాచారం.చర్చల్లో పాల్గొన్న అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ ప్రకారం,ఈ చర్చలు సానుకూలంగా సాగి మంచి ఫలితాలు ఇచ్చాయని పేర్కొన్నారు.
అయితే,అణు ఒప్పందం కుదరకపోతే సైనిక దాడికి వెళ్తామని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ చేసే దాడుల ప్రణాళికలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.