New year 2024 : అందరి కంటే ముందుగా కొత్త సంవత్సరం వేడుకలు అక్కడే
ఈ వార్తాకథనం ఏంటి
2024 సంవత్సరం ప్రపంచం తలుపు తట్టింది. అంతర్జాతీయ కాలమానం ప్రకారం, వివిధ దేశాల్లో తేదీలు, సమయం కాస్త భిన్నంగా ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో క్యాలెండర్ మారేందుకు మరికొన్ని గంటలు పడుతుందట. ఈ మేరకు న్యూ ఇయర్ వేడుకలు మొదట మధ్య పసిఫిక్ మహా సముద్రంలోని కిరిబాటి ద్వీపంలో మొదలయ్యాయి.
అనంతరం న్యూజిలాండ్‌లోని ఆక్లండ్ స్కైటవర్ వద్ద అద్భుతమైన బాణాసంచా వెలుగులతో అందరికంటే ముందుగా 2024 కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు.
ఇక న్యూజిలాండ్‌లో ఉత్తర, దక్షిణాన రెండు ప్రధాన ద్వీపాలున్నాయి. ఈ రెండింటికి ఒకే కాలరేఖ ఉంది. ఈ రెండు ప్రాంతాల్లో ఒకే సమయంలో కొత్త సంవత్సరం ప్రారంభమైందని దీని అర్థం.
DETAILS
పెద్ద నగరాల్లో ఆక్లండ్ ది మొదటి స్థానం
న్యూజిలాండ్ లోని ఆక్లండ్‌లో స్కైటవర్ వద్ద కొత్త సంవత్సర వేడుకల కోసం వేలాది జనం గుమిగూడారు. 2024 సంవత్సరాన్ని స్వాగతించిన పెద్ద నగరాల్లో న్యూజిలాండ్‌లోని ఆక్లండ్ మొదటి స్థానం ఆక్రమించింది.
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కొత్త సంవత్సరం వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దాదాపు ఎనిమిదిన్నర టన్నుల బాణాసంచా వెలుగులు విరజిమ్మింది.
హార్బర్ బ్రిడ్జి, ఓపెరా హౌస్‌పై ఉన్న అంబరమంతా మిరుమిట్లు గొలిపింది. దీంతో బాణసంచా వెలుగుల కోసం 15 నెలల ముందుగానే పనులు షురువయ్యాయి.
ఈ క్రమంలోనే సుమారుగా 12 నిమిషాల సేపు ఈ వెలుగులు కొనసాగాయి. ఇదే సమయంలో ప్రజలు నృత్యంతో సందడి చేశారు.
సిడ్నీతోపాటు కాన్‌బెర్రా, మెల్‌బోర్న్‌లో కూడా కొత్త సంవత్సరం సంబరాలు మొదలయ్యాయి.
details
ఏఏ దేశాల్లో ఏమేం చేశారంటే..
ప్రపంచ దేశాల్లో ప్రజలు పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుని ఆంగ్ల కొత్త సంవత్సరాదిని ఆహ్వానించారు.
ఈ మేరకు కేకులు కట్ చేస్తూ డాన్సులు చేసేవారిని, బాణసంచా వెలుగులను చూస్తూ జనం సంబురాల్లో తేలిపోయారు.
జపాన్ వాసులు 2024 కొత్త సంవత్సరాన్ని ఉత్సాహంగా ఆహ్వానించారు.అర్ధరాత్రి 12 గంటలు కాగానే, దేశవ్యాప్తంగా ఉన్న బౌద్ధాలయాల్లో గంటలు నిరంతరాయంగా మార్మోగాయి. ప్రతి గుడిలోనూ 108 సార్లు గంటలు మోగాయి.
జపాన్ రాజధాని టోక్యోలో ప్రజలంతా తేదీ ఎప్పుడు మారుతుందా అని ఆసక్తిగా ఎదురుచూశారు.
దక్షిణ కొరియా రాజధాని సోల్, ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లోనూ అక్కడి ప్రజలు హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించుకున్నారు.