Loading...
New York: భార్యతో వివాదం.. న్యూయార్క్ టైమ్స్‌ ఉద్యోగిని కాల్చిచంపిన అత్తమామలు
భార్యతో వివాదం.. న్యూయార్క్ టైమ్స్‌ ఉద్యోగిని కాల్చిచంపిన అత్తమామలు

New York: భార్యతో వివాదం.. న్యూయార్క్ టైమ్స్‌ ఉద్యోగిని కాల్చిచంపిన అత్తమామలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 29, 2026
03:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

న్యూయార్క్ టైమ్స్‌ (The New York Times) టెక్‌ ఎగ్జిక్యూటివ్‌ జొనాథన్ మెక్‌కిన్సే (Jonathan McKinsey) దారుణ హత్యకు గురయ్యారు. 40 ఏళ్ల మెక్‌కిన్సే కాలిఫోర్నియాలోని డబ్లిన్ స్పోర్ట్స్‌ గ్రౌండ్స్‌ పార్కింగ్‌ స్థలంలో తుపాకీ కాల్పుల్లో మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి ఆయన అత్తమామలు షౌయాంగ్ జాంగ్‌, షిలి చెన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మెక్‌కిన్సే న్యూయార్క్ టైమ్స్‌లో గేమ్స్‌ ప్లేయర్‌ ఎక్స్‌పీరియన్స్‌కు సంబంధించిన ఇంజినీరింగ్‌ విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు. 2023లో సంస్థలో చేరిన ఆయనకు దాదాపు రెండు దశాబ్దాల టెక్‌ కెరీర్‌ ఉంది. స్ప్లంక్‌ (Splunk), కోర్సెరా (Coursera), ఒరాకిల్‌ (Oracle) వంటి ప్రముఖ టెక్‌ సంస్థల్లోనూ ఆయన పనిచేశారు.

వివరాలు 

పార్కింగ్‌ స్థలంలో మెక్‌కిన్సే మృతదేహం.. అత్తమామల అరెస్టు

సెప్టెంబర్‌ 26న మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో డబ్లిన్ స్పోర్ట్స్‌ గ్రౌండ్స్‌ వద్ద ఓ పోలీసు అధికారి పార్కింగ్‌ స్థలంలో వ్యక్తి నేలపై పడి ఉండటాన్ని గుర్తించారు.

అదే సమయంలో కాల్పులపై పోలీసులకు పలుమార్లు అత్యవసర ఫోన్‌కాల్స్‌ వచ్చాయి.

అక్కడికి చేరుకున్న అధికారులు మెక్‌కిన్సేను బహుళ తుపాకీ గాయాలతో గుర్తించారు.

ఘటనాస్థలంలోనే ఆయన మృతి చెందినట్లు ప్రకటించారు.సాక్షుల సహకారంతో పోలీసులు ఘటన జరిగిన కొద్దిసేపటికే సమీపంలో ఉన్న ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

వారిని షౌయాంగ్ జాంగ్‌, షిలి చెన్‌గా గుర్తించారు. ఇద్దరూ భార్యాభర్తలు,మెక్‌కిన్సే అత్తమామలని పోలీసులు తెలిపారు.

వారిపై హత్య అనుమానంతో కేసు నమోదు చేసి శాంటా రీటా జైలుకు తరలించారు.

వివరాలు 

కొంతకాలంగా వేర్వేరుగా మెక్‌కిన్సే,ఆయన భార్య

ఈ కేసులో మరెవరూ నిందితులుగా లేరని, ప్రజలకు ప్రస్తుతం ఎలాంటి ముప్పు లేదని పోలీసులు వెల్లడించారు.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు మెక్‌కిన్సేపై కాల్పులు జరిపారు.

వారిద్దరూ వంతులవారీగా కాల్పులు జరిపినట్లు సాక్షులు పేర్కొన్నారు.

అయితే ఈ వివరాలను దర్యాప్తు అధికారులు పూర్తిగా ధ్రువీకరించాల్సి ఉంది. హత్యకు దారితీసిన అసలు కారణాన్ని తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మెక్‌కిన్సే, ఆయన భార్య కాండిస్ జాంగ్‌ (Candice Jang) కొంతకాలంగా వేర్వేరుగా నివసిస్తున్నారు.

వీరిద్దరి మధ్య విడాకులు, పిల్లల సంరక్షణకు సంబంధించిన వివాదం కొనసాగుతోంది.

2025లో ఇద్దరూ ఒకరిపై ఒకరు గృహహింస నిరోధక ఉత్తర్వుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు కోర్టు రికార్డుల ఆధారంగా వెల్లడైంది.

ADVERTISEMENT

వివరాలు 

ట్రాన్స్‌జెండర్‌ గుర్తింపుపై వేధింపుల ఆరోపణలు

మెక్‌కిన్సే కోర్టులో దాఖలు చేసిన పత్రాల్లో తన ట్రాన్స్‌జెండర్‌ గుర్తింపు కారణంగా భార్య,అత్తమామలు తనను వేధించారని ఆరోపించారు.

పిల్లల దుస్తుల ఎంపిక ఆధారంగా తన అత్తగారు తనను,తన కుమారుల్లో ఒకరిని LGBTQ వ్యక్తులుగా, అలాగే అవమానకరమైన పదాలతో దూషించారని పేర్కొన్నారు.

2010లో డబుల్‌ మాస్టెక్టమీ శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్న సమయంలో తన మామగారు తన ఛాతిపై పిడికిలితో కొట్టారని కూడా ఆయన ఆరోపించారు.

తన భార్య కూడా తనతో హింసాత్మకంగా ప్రవర్తించేదని పేర్కొన్నారు.

మెక్‌కిన్సే 2010లో స్త్రీ నుంచి పురుషుడిగా మారారు. 2012లో కాండిస్ జాంగ్‌ను వివాహం చేసుకున్నట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి.

2013లో జరిగిన మరో వివాదంలో తన భార్య తనను ఫ్రైయింగ్‌ పాన్‌తో కొట్టిందని మెక్‌కిన్సే ఆరోపించారు.

ADVERTISEMENT

వివరాలు 

భార్య ఆరోపణలు.. మెక్‌కిన్సేపై రెండు కేసులు నమోదు

పిల్లలను కూడా జాంగ్‌ మాటలతో వేధించేవారని ఆయన తన ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.

మరోవైపు.. 2025 అక్టోబర్‌లో కాండిస్ జాంగ్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో మెక్‌కిన్సేపై పలు ఆరోపణలు చేసింది.

ఓ వాగ్వాదం సమయంలో తన ముంజేతులను పట్టుకుని టేబుల్‌ మూలకు నెట్టడంతో తన పైవీపులోని వెన్నుపూసకు గాయమైందని ఆమె పేర్కొంది.

తన తల్లిని మెక్‌కిన్సే మానసికంగా వేధించారని కూడా ఆరోపించింది.

2025లో మెక్‌కిన్సేపై పిల్లలతో సంబంధం ఉన్న రెండు నేరపూరిత కేసులు నమోదయ్యాయి.

తన ఆరేళ్ల కుమారుడి ముఖంపై ఆయన చేతితో కొట్టారని, 2018లో జరిగిన ఓ గొడవలో తనకు గాయాలు చేశారని జాంగ్‌ ఆరోపించింది.

ఈ ఆరోపణలను మెక్‌కిన్సే తిరస్కరించి, తాను నిర్దోషినని వాదించారు.

వివరాలు 

భార్య ఆరోపణలు.. మెక్‌కిన్సేపై రెండు కేసులు నమోదు

అనంతరం పేరెంటింగ్‌ తరగతులకు హాజరు కావాలనే షరతుతో ఆయన బెయిల్‌పై విడుదలైనట్లు పలు అమెరికా మీడియా సంస్థలు కోర్టు రికార్డులను ఉటంకిస్తూ వెల్లడించాయి.

మెక్‌కిన్సే హత్యకు సంబంధించిన దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. పోలీసులు మాత్రం ప్రస్తుతానికి హత్యకు ఖచ్చితమైన ఉద్దేశాన్ని అధికారికంగా వెల్లడించలేదు.

కుటుంబ వివాదం, విడాకులు, పిల్లల సంరక్షణకు సంబంధించిన న్యాయపోరాటం తదితర అంశాలను దర్యాప్తులో పరిశీలిస్తున్నట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి.

ADVERTISEMENT