Nijjar-Murder-Canda-Justice Trudo: నిజ్జార్ హత్య కేసు నిందితులకు అరెస్టుపై స్పందించిన కెనడా ప్రధాని ట్రూడో
ఖలీస్తాని (Khalistani) ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్య కేసులో కెనడా (Canada) పోలీసులు (cops)ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన విషయంపై ఆ దేశ ప్రధాని జస్టిస్ ట్రూడో (Justice Trudo) స్పందించారు. చట్టబద్ధమైన పాలన కెనడాలో ఉందని తమ దేశం స్వతంత్ర బలమైన న్యాయ వ్యవస్థలను కలిగి ఉందని ట్రూడో చెప్పారు. తమ దేశ పౌరులు అందర్నీ రక్షించుకోవడమే ప్రభుత్వ కర్తవ్యం అని అన్నారు. కెనడాలో ఉన్న ప్రతి వ్యక్తికి భద్రతతో జీవించే హక్కు ఉందని, ఇటువంటి వివక్ష హింస లేకుండా జీవించడం దేశ పౌరుల ప్రాథమిక హక్కుని స్పష్టం చేశారు.
నిజ్జర్ హత్య తర్వాత ఒక వర్గం అభద్రతతో జీవిస్తోంది: ట్రూడో
హర్దీప్ సింగ్ నిజ్జర్ మృతి తర్వాత తమ దేశంలో ఒక వర్గం అభద్రతాభావంతో జీవిస్తుందని ట్రూడో తెలిపారు. నిజ్జర్ హత్యలు భారత ఏజెంట్ల జోక్యం ఉందని ట్రూడో చేసిన నిరాధార ఆరోపణలు తీవ్ర దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. కాగా, నిజ్జర్ కేసులో భారత్ కు చెందిన ముగ్గురు నిందితులకు పాకిస్థాన్ (Pakistan) ఐఎస్ఐ (ISI)తో సంబంధాలు ఉన్నట్లుగా భారత (Bharat) ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి.