Loading...
New World Map: జమ్మూ కశ్మీర్‌, లద్దాఖ్‌ విషయంలో తగ్గేదేలే.. వరల్డ్‌ మ్యాప్‌పై భారత్‌ కీలక వ్యాఖ్యలు!
జమ్మూ కశ్మీర్‌, లద్దాఖ్‌ విషయంలో తగ్గేదేలే.. వరల్డ్‌ మ్యాప్‌పై భారత్‌ కీలక వ్యాఖ్యలు!

New World Map: జమ్మూ కశ్మీర్‌, లద్దాఖ్‌ విషయంలో తగ్గేదేలే.. వరల్డ్‌ మ్యాప్‌పై భారత్‌ కీలక వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 06, 2026
05:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ పటంలో వివిధ దేశాలు, ఖండాల భూభాగాలను వాటి వాస్తవ పరిమాణానికి అనుగుణంగా చూపించేలా రూపొందించిన ఐక్యరాజ్య సమితి తీర్మానానికి భారతదేశం మద్దతు తెలిపింది. అయితే ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసినంత మాత్రాన ఏదైనా నిర్దిష్ట మ్యాప్ లేదా మ్యాప్ ప్రొజెక్షన్‌ను భారత్ ఆమోదించినట్లు కాదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) స్పష్టం చేసింది. సెప్టెంబర్ 4న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ.. ఆఫ్రికాతో పాటు మరికొన్ని ప్రాంతాలను వాటి వాస్తవ విస్తీర్ణానికి అనుగుణంగా చూపించే ప్రపంచ పటానికి సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానంపై భారత్ అనుకూలంగా ఓటు వేసింది.

వివరాలు

సమాన విస్తీర్ణ ప్రాతినిధ్యానికే మద్దతు

తీర్మానంపై భారత్‌ వైఖరిని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు.

ప్రపంచ పటంలో భూభాగాలను వాటి వాస్తవ పరిమాణానికి అనుగుణంగా చూపించే సమాన-విస్తీర్ణ ప్రాతినిధ్యం అనే ప్రాథమిక సూత్రానికి భారత్ మద్దతు తెలిపిందని ఆయన పేర్కొన్నారు.

అయితే ఈ తీర్మానం రాజకీయ కార్టోగ్రఫీ, వివాదాస్పద భూభాగాలు, సరిహద్దులు, ప్రాంతాల పేర్లకు సంబంధించి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదని జైస్వాల్ స్పష్టం చేశారు.

వివరాలు

జమ్మూ కశ్మీర్‌, లద్దాఖ్‌పై భారత్ స్పష్టత

ఇదే సమయంలో జమ్మూ కశ్మీర్‌, లద్దాఖ్‌ విషయంలో భారత్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది.

జమ్మూ కశ్మీర్‌, లద్దాఖ్‌తో సహా భారత సార్వభౌమ భూభాగాన్ని దేశ అధికారిక మ్యాప్‌ ప్రకారమే ప్రపంచ పటాల్లో చూపించాలని రణధీర్ జైస్వాల్ అన్నారు.

భారత భూభాగాన్ని తప్పుగా లేదా తప్పుదారి పట్టించే విధంగా చిత్రీకరించడాన్ని భారత్ అంగీకరించదని ఆయన స్పష్టం చేశారు.

దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత విషయంలో భారత్ వైఖరి స్పష్టమైనదని, స్థిరమైనదని తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు

ఐక్యరాజ్యసమితి 'కరెక్ట్ ద మ్యాప్' తీర్మానం ఏంటి?

ప్రస్తుతం ప్రపంచ పటాల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్న ప్రొజెక్షన్‌కు మూలం 1569లో రూపొందించిన మెర్కేటర్ ప్రొజెక్షన్. ఇది ప్రధానంగా నావిగేషన్‌కు ఉపయోగకరంగా ఉన్నప్పటికీ.. భూమధ్యరేఖకు దూరంగా ఉన్న ప్రాంతాలను వాటి వాస్తవ విస్తీర్ణం కంటే పెద్దవిగా చూపిస్తుంది.

భూమధ్యరేఖకు సమీపంగా ఉన్న ఆఫ్రికా వంటి ప్రాంతాలు..ఉత్తరార్థగోళంలో ఉన్న కొన్ని ప్రాంతాల కంటే చిన్నవిగా కనిపిస్తాయి.

వాస్తవానికి వాటి విస్తీర్ణం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, మెర్కేటర్ ప్రొజెక్షన్‌లో అవి తక్కువ పరిమాణంలో ఉన్నట్లు కనిపిస్తాయి.

ఈ సమస్యకు ప్రత్యామ్నాయంగా 'ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్'ను రూపొందించారు. ప్రపంచ పటంలో వివిధ భూభాగాల విస్తీర్ణాన్ని మరింత ఖచ్చితంగా ప్రతిబింబించడమే దీని ఉద్దేశం.

2018లో అభివృద్ధి చేసిన ఈప్రొజెక్షన్‌లో ఆఫ్రికా ఖండం.. మెర్కేటర్ ప్రొజెక్షన్‌లో కనిపించే దానికంటే పెద్దదిగా కనిపిస్తుంది.

ADVERTISEMENT