Page Loader
Nobel laureate Muhammad Yunus: నోబెల్ గ్రహీత కు బంగ్లాదేశ్ కోర్టు 6 నెలల జైలు శిక్ష 
Nobel laureate Muhammad Yunus: నోబెల్ గ్రహీత కు బంగ్లాదేశ్ కోర్టు 6 నెలల జైలు శిక్ష

Nobel laureate Muhammad Yunus: నోబెల్ గ్రహీత కు బంగ్లాదేశ్ కోర్టు 6 నెలల జైలు శిక్ష 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 02, 2024
01:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

కార్మిక చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై నోబెల్ గ్రహీత,గ్రామీణ బ్యాంక్ వ్యవస్థాపకుడు ముహమ్మద్ యూనస్‌కు బంగ్లాదేశ్ కోర్టు సోమవారం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. గ్రామీణ్ టెలికాం డైరెక్టర్,మాజీ మేనేజింగ్ డైరెక్టర్ ఎండీ అష్రాఫుల్ హసన్,డైరెక్టర్ల బోర్డు సభ్యులు నూర్జహాన్ బేగం,ఎండి షాజహాన్‌లతో సహా యూనస్,అతని ముగ్గురు సహచరులకు ఢాకా లేబర్ కోర్టు న్యాయమూర్తి షేక్ మెరీనా సుల్తానా ఆరు నెలల జైలు శిక్ష విధించారు. ముహమ్మద్ యూనుస్ కార్మిక చట్టం,నిధుల దుర్వినియోగానికి సంబంధించి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.అంతేగాక ప్రభుత్వంతో వివిద అంశాల్లో వ్యతిరేకిస్తున్నారు. 2008లో షేక్ హసీనా ప్రభుత్వం ఈయన కేసులపై దర్యాప్రు ప్రారంభించింది. 2011లో గ్రామీణ బ్యాంకు కార్యకలాపాలపైన కూడా సమీక్ష నిర్వహించింది.అంతేకాకుండా వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆయనను తొలగించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ముహమ్మద్ యూనస్‌కు ఆరు నెలల జైలు శిక్ష