
Operation Sindoor: భారత్-పాక్ మధ్య యుద్ధంలో జోక్యం చేసుకోబొం: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో, తాము ఈ సంఘర్షణలో జోక్యం చేసుకోబోమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు.
ఫాక్స్ న్యూస్ చానెల్ నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
''రెండు అణుశక్తి గల దేశాలు ఒకరినొకరు ఢీకొంటుండటాన్నిచూసి మేం తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం.ఈ ఉద్రిక్త పరిస్థితులు త్వరగా కుదురుకోవాలని ఆకాంక్షిస్తున్నాం.భారత్‌కు పాకిస్థాన్‌పై కొన్ని కీలకమైన ఆరోపణలు ఉన్నాయి.ఆ ఆరోపణల నేపథ్యంలో న్యూఢిల్లీ తీసుకున్న చర్యలకు ఇస్లామాబాద్ స్పందిస్తోంది. ఇరుపక్షాలూ ఉద్రిక్తతను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని మేము సూచించగలిగితే తప్ప, యుద్ధంలో ఏ రూపంలోనూ తలదూర్చే ఉద్దేశం మాకు లేదు. ఈ విషయంలో అమెరికా పాత్ర అసలు ఉండదు'' అని వాన్స్ స్పష్టంగా తెలిపారు.
వివరాలు
50 డ్రోన్లను కూల్చేసిన భారత సైన్యం
అలాగే, ''భారత్, పాకిస్థాన్ ఆయుధాలు వదలాలని అమెరికా చెబితే అది సమంజసం కాదు. కానీ ఈ సమస్యకు సమాధానం అనేది ద్వైపాక్షిక చర్చల ద్వారానే సాధ్యమవుతుంది. ఈ మార్గమే ప్రాంతీయ స్థాయిలో ముప్పును నివారించే ఉత్తమ మార్గం'' అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా, గురువారం రాత్రి ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి.
ఈ క్రమంలో పాకిస్థాన్ వైపు నుంచి భారత భూభాగంలోకి ప్రవేశించిన సుమారు 50 డ్రోన్లను భారత సైన్యం సమర్థంగా కూల్చివేసింది.