NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / North Korea: ఉత్తరకొరియాలో దక్షిణ కొరియా డ్రోన్‌లు..! 
    తదుపరి వార్తా కథనం
    North Korea: ఉత్తరకొరియాలో దక్షిణ కొరియా డ్రోన్‌లు..! 
    ఉత్తరకొరియాలో దక్షిణ కొరియా డ్రోన్‌లు..!

    North Korea: ఉత్తరకొరియాలో దక్షిణ కొరియా డ్రోన్‌లు..! 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 19, 2024
    12:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర కొరియా,దక్షిణ కొరియా మధ్య శత్రుత్వం ప్రపంచ వ్యాప్తంగా తెలిసిన విషయం. ఈ రెండు దేశాల మధ్య విరోధం రోజురోజుకు తీవ్రతరం అవుతుంది.

    ఈ నేపథ్యంలో, కిమ్ సర్కారు ఇటీవల దక్షిణ కొరియాకు చెందిన డ్రోన్‌లు తమ భూభాగంలో కనిపించాయని తెలిపింది.

    ఈ విషయానికి సంబంధించి ఆ దేశ అధికారిక మీడియా ఫొటోలను విడుదల చేసింది.

    రాజధాని పాంగ్యాంగ్‌లో నిర్వహించిన సాధారణ సోదాల్లో దక్షిణ కొరియాకు చెందిన డ్రోన్‌లు కనుగొన్నట్లు కిమ్ సర్కారు పేర్కొంది.

    ఈ నెలలో మూడు సార్లు దక్షిణ కొరియా ఇలాంటి డ్రోన్‌లను ఉపయోగించి ప్రచార కరపత్రాలను వదిలినట్లు ఆరోపించింది.

    వివరాలు 

    ప్రతీకార దాడులు కూడా తీవ్రతరం 

    అయితే , తమ భూభాగంలో కనిపించిన డ్రోన్‌లు గత నెలలో దక్షిణ కొరియా సైనిక కవాతులో కనిపించినవేనని ఉత్తర కొరియా మిలిటరీ, స్టేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు నిర్ధారించాయి.

    ఇక మరోవైపు, డ్రోన్‌లను ఉపయోగించి తమ భూభాగంలో కరపత్రాలు వదలడం ఉత్తర కొరియా మంత్రిత్వశాఖ తీవ్రంగా పరిగణించింది.

    ఒకసారి మళ్లీ తమ గగనతలంలో శత్రు దేశం డ్రోన్‌లు ఎగిరినా, సరిహద్దుల్లో నిబంధనలు ఉల్లఘించినా, దీనిని యుద్ధ ప్రకటనగా పరిగణిస్తామని హెచ్చరించింది. ప్రతీకార దాడులు కూడా తీవ్రతరం అవుతాయని వ్యాఖ్యానించింది.

    వివరాలు 

    కిమ్ సర్కారు రాజ్యాంగంలో సవరణలు

    అలాగే, మే చివరి వారం నుంచి దక్షిణ కొరియా గగనతలంపై కిమ్ ప్రభుత్వం వేల సంఖ్యలో చెత్త బెలూన్లు పంపించింది.

    అనంతరం, దక్షిణ కొరియాతో తమ సరిహద్దును పూర్తిగా మూసివేయాలని నిర్ణయించింది.

    ఈ నిర్ణయంలో భాగంగా, ఇరుదేశాలను కలిపే రోడ్లు, రైల్వే మార్గాలను ఇటీవల బాంబులతో పేల్చింది.

    అంతేకాదు, దక్షిణ కొరియాను శత్రు దేశంగా పరిగణిస్తూ కిమ్ సర్కారు తమ రాజ్యాంగంలో సవరణలు చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర కొరియా
    దక్షిణ కొరియా

    తాజా

    Shehbaz Sharif: భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధం.. కానీ కశ్మీర్‌పై చర్చ జరగాలి: పాక్ ప్రధాని షెహబాజ్ పాకిస్థాన్
    Rain Alert: హైదరాబాద్‌తో పాటు 12 జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక.. వాతావరణ శాఖ అలెర్ట్ హైదరాబాద్
    Nirav Modi: యూకే హైకోర్టులో నీర‌వ్ మోదీకి షాక్‌.. బెయిల్ పిటిష‌న్ కొట్టివేత‌ యునైటెడ్ కింగ్డమ్
    Saraswati Pushkaralu: కాళేశ్వరం అభివృద్ధికి రూ.200 కోట్ల నిధులు: రేవంత్ రెడ్డి  తెలంగాణ

    ఉత్తర కొరియా

    Northkorea: చెత్తతో నిండిన బెలూన్లను ఎగరేసిన  ఉత్తర కొరియా .. దక్షిణ కొరియా విమానాశ్రయ కార్యకలాపాలకు అంతరాయం  దక్షిణ కొరియా
    South Korea: తారాస్థాయికి చెత్త యుద్ధం.. దక్షిణ కొరియా అధ్యక్షుడి కార్యాలయంలోకి చెత్త బెలూన్స్ దక్షిణ కొరియా
    Nasa: నాసాపై ఉత్తర కొరియా వ్యక్తి సైబర్ దాడికి పాల్పడ్డాడని ఆరోపించిన అమెరికా  టెక్నాలజీ
    North Korea: చెత్త బుడగలు పంపిన ఉత్తరకొరియా.. దక్షిణ కొరియా వైమానిక రంగానికి సంకటం దక్షిణ కొరియా

    దక్షిణ కొరియా

    'మెదడు తినే అమీబా'తో దక్షిణ కొరియాలో తొలి మరణం.. ప్రపంచ దేశాలు అలర్ట్ ప్రపంచం
    దక్షిణ కొరియాలో సెక్స్ బొమ్మల దిగుమతిపై నిషేధం ఎత్తివేత.. పిల్లల ఆకారంలోని డాల్స్ పై మాత్రం..!! అంతర్జాతీయం
    ఆ ఆరు దేశాల మీదుగా ప్రయాణిస్తున్నారా ? అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి కరోనా కొత్త మార్గదర్శకాలు
    ఈ దేశాల్లో మన రూపాయి వీలువ చాలా ఎక్కువ, అవేంటో తెలుసా? జీవనశైలి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025