
జాతివివక్ష వల్లే అమెరికా సైనికుడు మా వద్దకు వచ్చాడు: ఉత్తర కొరియా
ఈ వార్తాకథనం ఏంటి
కటిక దరిద్రం, కఠిన ఆంక్షలు నేపథ్యంలో నిత్యం ఉత్తర కొరియా నుంచి వందలాది మంది ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్తుంటారు. అయితే తాజాగా అందుకు విరుద్ధమైన, అందరిని ఆశ్చర్యపరిచే సంఘటన ఒకటి జరిగింది.
అమెరికా సైనికుడు ట్రావిస్ టి.కింగ్ ఉత్తర కొరియాకు వలస వెళ్లడం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
ఉత్తర కొరియా నుంచి వందలాది మంది బయటకు వస్తుంటే, ఆ దేశానికి కావాలని వెళ్లిన ఏకైక శరణార్థిగా ట్రావిస్ నిలిచిపోయాడు.
ట్రావిస్ శరణార్థిగా వెళ్లడంపై ఉభయ కొరియా కీలక ప్రకటన విడుదల చేసింది.
అమెరికా సైన్యంలోని అమానవీయ ప్రవర్తన, జాతి వివక్ష కారణంగానే ట్రావిస్ సరిహద్దు దాటి వచ్చినట్లు కిమ్ ప్రభుత్వం తెలిపింది. ఈ విషయాన్ని ట్రావిస్ తమకు చెప్పినట్లు వెల్లడించింది.
కిమ్
జులై 18న ఉత్తర కొరియా సరిహద్దు దాటిన సైనికుడు
అంతేకాకుండా ట్రావిస్ టి.కింగ్ ఉద్దేశపూర్వకంగానే శరణార్థిగా వచ్చినట్లు ఉత్తర కొరియా దర్యాప్తు బృందాలు కూడా నిర్దారించాయి.
అయితే అక్రమంగా ఉత్తర కొరియాలోకి వెళ్లిన ట్రావిస్ ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తికంగా మారింది. శరణార్థిగా వచ్చిన అతడిని ఆదరిస్తుందా? లేక విచారించి శిస్తుందో తెలియాల్సి ఉంది.
జులై 18న ఉత్తర కొరియా- దక్షిణ కొరియా సరిహద్దులో జాయింట్ సెక్యూరిటీ ఏరియా పౌర పర్యటనలో ఉండగా ఉత్తరం వైపు దూసుకుపోయాడు. అటు నుంచి ఉత్తరకొరియాలోకి పారిపోయాడు.
అయితే అమెరికా మాత్రం సైనికుడిని సురక్షితంగా అమెరికాకు రప్పించేందుకు ఐరాసతో చర్చలు జరుపుతోంది. ట్రావిస్‌ను సురక్షితంగా వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చడమే తమ లక్ష్యమని పెంటగాన్ చెబుతోంది.