Page Loader
Ballistic Missile:2025లో మొదటి బాలిస్టిక్ మిస్సైల్ ప‌రీక్షించిన ఉత్తర కొరియా 
2025లో మొదటి బాలిస్టిక్ మిస్సైల్ ప‌రీక్షించిన ఉత్తర కొరియా

Ballistic Missile:2025లో మొదటి బాలిస్టిక్ మిస్సైల్ ప‌రీక్షించిన ఉత్తర కొరియా 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 06, 2025
02:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర కొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణి పరీక్షను నిర్వహించింది. తూర్పు తీరం వైపు ఈ పరీక్ష జరిగినట్లు దక్షిణ కొరియా మిలిటరీ వెల్లడించింది. సుమారు రెండు నెలల విరామం తరువాత ఉత్తర కొరియా తన మొదటి క్షిపణి పరీక్ష చేపట్టింది. సముద్రంలో కూలిపోవడానికి ముందు ఈ క్షిపణి సుమారు 1100 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. అయితే, ఉత్తర కొరియా కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని దక్షిణ కొరియా ఆరోపించింది.

వివరాలు 

దక్షిణ కొరియాలో రాజకీయ సంక్షోభం

ఇక, దక్షిణ కొరియా నాయకులతో సియోల్‌లో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సమావేశమవుతున్న సమయంలోనే ఈ పరీక్ష జరగడం విశేషం. ఉత్తర కొరియా నిర్వహిస్తున్న క్షిపణి పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని అమెరికాకు చేరవేస్తున్నట్లు దక్షిణ కొరియా తెలిపింది. ఇదిలా ఉండగా, దక్షిణ కొరియాలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను అరెస్ట్ చేయాలన్న ఆలోచనలో పోలీసులు ఉన్నారు. విపక్షాలు ఆయన్ను అభిశంసించిన సంగతి తెలిసిందే.