LOADING...
South Korea: ఉత్తర కొరియా 'జీపీఎస్' జామింగ్.. దక్షిణ కొరియాలో నిలిచిన విమనాలు, ఓడలు
ఉత్తర కొరియా 'జీపీఎస్' జామింగ్.. దక్షిణ కొరియాలో నిలిచిన విమనాలు, ఓడలు

South Korea: ఉత్తర కొరియా 'జీపీఎస్' జామింగ్.. దక్షిణ కొరియాలో నిలిచిన విమనాలు, ఓడలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 09, 2024
11:49 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర కొరియా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (GPS)ను జామింగ్‌ చేయడంతో అక్కడి విమానాలు, నౌకల రవాణా సేవలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. రెండు రోజుల పాటు కొనసాగిన ఈ చర్యల కారణంగా, విమాన సర్వీసులు, పశ్చిమ సముద్ర ప్రాంతంలో ఓడల రవాణా వ్యవస్థలో తీవ్ర సమస్యలు తలెత్తాయి. ఇలాంటి కవ్వింపు చర్యలు మానుకోవాలని ఉత్తర కొరియాను దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ కోరింది. అటువంటి చర్యలు ప్రమాదం ఏర్పడితే, దానికి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ ఏడాది మే 29 నుంచి జూన్‌ 2 వరకు ఉత్తర కొరియా పంపిన చెత్త బెలూన్ల వల్ల దక్షిణ కొరియాకు తీవ్ర ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయి.

Details

ఉత్తర కొరియా-దక్షిణ కొరియా మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం

సియోల్‌కు చెందిన రెండు ప్రధాన విమానాశ్రయాల్లోని రన్‌వేలను దాదాపు 20 రోజులు మూసివేయాల్సి వచ్చింది, దీంతో టేకాఫ్‌లు, ల్యాండింగ్‌లు కష్టతరంగా మారాయి. ఈ కారణంగా సుమారు 500 విమానాలు, వందలాది నౌకలు జీపీఎస్ సమస్యలను ఎదుర్కొన్నాయి. ఇటీవల ఉత్తర కొరియా-దక్షిణ కొరియా మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. మే చివరివారంలో దక్షిణ కొరియా వేల సంఖ్యలో చెత్త బెలూన్లను గగనతలంలో పంపింది. దీనికి ప్రతిస్పందనగా, ఉత్తర కొరియా తమ సరిహద్దును పూర్తిగా మూసివేసింది. ఈ క్రమంలో, రెండు దేశాలను కలిపే రోడ్లు, రైల్వే మార్గాలను ఉత్తర కొరియా బాంబులతో ధ్వంసం చేసింది.