Loading...
North Korea: ట్రంప్‌ చర్చల ప్రతిపాదనను పట్టించుకోని కిమ్‌.. అణ్వాయుధాలపై కీలక ప్రకటన
ట్రంప్‌ చర్చల ప్రతిపాదనను పట్టించుకోని కిమ్‌.. అణ్వాయుధాలపై కీలక ప్రకటన

North Korea: ట్రంప్‌ చర్చల ప్రతిపాదనను పట్టించుకోని కిమ్‌.. అణ్వాయుధాలపై కీలక ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 27, 2026
08:38 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మరోసారి తన దూకుడు వైఖరిని బయటపెట్టారు. ఆసియా పర్యటనలో భాగంగా తనతో సమావేశం కావాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రతిపాదనను పట్టించుకోని ఆయన.. దేశంలో అణ్వాయుధాల తయారీని మరింత వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ట్రంప్‌ చర్చలకు ఆహ్వానించిన కొద్ది రోజులకే కిమ్‌ అణు పదార్థాల ఉత్పత్తి కేంద్రాలను సందర్శించడం, మరిన్ని అణ్వాయుధాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

వివరాలు 

అణ్వాయుధాల నిల్వ కేంద్రాలను కిమ్‌ పరిశీలిస్తున్న ఫొటోలు విడుదల 

ఉత్తర కొరియాకు చెందిన రెండు అణు పదార్థాల ఉత్పత్తి కేంద్రాలను కిమ్‌ పరిశీలించినట్లు ఆ దేశ అధికారిక వార్తా సంస్థ కేసీఎన్‌ఏ గురువారం వెల్లడించింది.

ఈ సందర్భంగా యురేనియం శుద్ధి ప్రక్రియలో ఉపయోగించే సెంట్రిఫ్యూజ్‌లు, అణ్వాయుధాల నిల్వ కేంద్రాలను కిమ్‌ పరిశీలిస్తున్న ఫొటోలను విడుదల చేసింది.

ఆయన వెంట పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు.

అయితే విడుదల చేసిన కొన్ని ఫొటోల్లో కీలక వివరాలు కనిపించకుండా బ్లర్‌ చేశారు.

అంతకుముందు బుధవారం కిమ్‌ ఓ అణు పరిశోధనా సంస్థను కూడా సందర్శించినట్లు కేసీఎన్‌ఏ పేర్కొంది.

వివరాలు 

కేంద్రాల ప్రాంతాన్ని వెల్లడించని ఉత్తర కొరియా

కిమ్‌ సందర్శించిన అణు ఉత్పత్తి కేంద్రాలు ఎక్కడ ఉన్నాయనే విషయాన్ని ఉత్తర కొరియా అధికారికంగా వెల్లడించలేదు.

2010లో అమెరికాకు చెందిన నిపుణుల బృందానికి యోంగ్‌బ్యోన్‌ అణు సముదాయంలోని యురేనియం శుద్ధి కేంద్రాన్ని ఉత్తర కొరియా చూపించింది.

ఆ తర్వాత కూడా ఇలాంటి అణు కేంద్రాలను పలుమార్లు బహిరంగంగా ప్రదర్శించింది.

అయితే తాజా పర్యటనలో సందర్శించిన కేంద్రాల వివరాలను మాత్రం బయటపెట్టలేదు.

అవి కూడా యోంగ్‌బ్యోన్‌ అణు సముదాయంలోనే ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

అమెరికా, దక్షిణ కొరియాలతో ముప్పు ఉందంటూ వ్యాఖ్యలు

కొరియా ద్వీపకల్పంలో భద్రతాపరమైన ముప్పులు పెరుగుతున్నాయని కిమ్‌ పేర్కొన్నారు.

ఈ పరిస్థితుల్లో దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, అందులో భాగంగానే అణు పదార్థాల ఉత్పత్తి కేంద్రాలను సందర్శించినట్లు వెల్లడించారు.

అణుశక్తితో పనిచేసే జలాంతర్గాములను సమకూర్చుకోవాలని ఈ ప్రాంతంలోని తన మిత్రదేశాలను అమెరికా ప్రోత్సహిస్తోందని కిమ్‌ ఆరోపించారు.

అంతేకాకుండా ఆయా దేశాలతో అణ్వాయుధాలను పంచుకునేందుకు కూడా అమెరికా సిద్ధమవుతోందని విమర్శించారు.

ADVERTISEMENT

వివరాలు 

అమెరికా, దక్షిణ కొరియాలతో ముప్పు ఉందంటూ వ్యాఖ్యలు

ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఉత్తర కొరియా కూడా తగిన స్థాయిలో అణ్వాయుధాలను కలిగి ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

దక్షిణ కొరియాతో తమ దేశానికి ఉన్న సరిహద్దు కూడా భద్రతాపరంగా పెద్ద సవాలుగా మారిందని కిమ్‌ అభిప్రాయపడ్డారు.

అయితే ఆయన చేసిన ఆరోపణలను దక్షిణ కొరియా ఖండించింది.

అణ్వాయుధాల నుంచి ఎదురయ్యే ముప్పులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అమెరికాతో కలిసి అవసరమైన సన్నద్ధతను కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది.

ADVERTISEMENT