
operation sindoor: ఆపరేషన్ సిందూర్‌లో మా సైనికులు 11 మంది చనిపోయారు: పాక్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ వల్ల తమకు తలపెట్టిన నష్టాలను పాకిస్థాన్ ఒక్కొక్కటిగా బయటపెడుతోంది.
తాజాగా ఆ దేశం వెల్లడించిన వివరాల ప్రకారం,ఈ దాడుల్లో మొత్తం 11 మంది పాకిస్థాన్ సైనికులు ప్రాణాలు కోల్పోగా, మరో 78 మంది తీవ్రంగా గాయపడ్డారు.
అంతేకాకుండా, పాకిస్థాన్ వాయుసేనకు చెందిన ఐదుగురు సిబ్బంది మరణించారని వెల్లడించింది.
మృతుల్లో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్ ఉన్నట్లు కూడా పేర్కొంది.
భారత ఆపరేషన్ కారణంగా 40 మంది పౌరులు మరణించారని, 121 మంది తీవ్రంగా గాయపడ్డారని పాకిస్థాన్ సైన్యం అధికారికంగా ప్రకటించింది.
ఈ మేరకు పాకిస్థాన్ సైన్యం తరఫున డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రీలేషన్స్ (డీజీ ఐఎస్‌పీఆర్) ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశారు.
వివరాలు
అహ్మద్ షరీఫ్ చౌధరీ మీడియా సమావేశం
ఇటీవలి కాలంలో కూడా పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధరీ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి నేవీ,ఎయిర్‌ఫోర్స్ అధికారులతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,"భారత్‌తో జరిగిన సైనిక ఎదురు దాడుల్లో పాకిస్థాన్ వాయుసేనకు చెందిన ఒక యుద్ధ విమానం స్వల్పంగా నష్టపోయింది,"అని చెప్పారు.అయితే, ఆ విమానం ఎంత మేరకు ధ్వంసమైందోనన్న విషయంపై స్పష్టమైన వివరాలు వెల్లడించలేదు.
వివరాలు
కూలిన యుద్ధ విమానం పాకిస్థాన్‌కు చెందిన మిరాజ్ జెట్
ఇక భారత వాయుసేనకు చెందిన ఎయిర్ మార్షల్ ఏకే భారతి ఇటీవల మీడియా బ్రీఫింగ్ లో మాట్లాడుతూ, "భారత వాయుసేన పాక్‌కు చెందిన యుద్ధ విమానాలను కూల్చివేసింది,"అని స్పష్టంగా ప్రకటించారు.
అయితే ఈ విమానాల శకలాలు పాకిస్థాన్ భూభాగంలోనే పడిపోయినట్లు వివరించారు.
ఈ కూలిన యుద్ధ విమానం పాకిస్థాన్‌కు చెందిన మిరాజ్ జెట్ కావచ్చని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు.