Loading...
Portugal Housing Crisis: పోర్చుగల్‌లో ఇళ్ల ధరలు, అద్దెలపై ఆగ్రహం.. 30కి పైగా నగరాల్లో భారీ నిరసనలు!
పోర్చుగల్‌లో ఇళ్ల ధరలు, అద్దెలపై ఆగ్రహం.. 30కి పైగా నగరాల్లో భారీ నిరసనలు!

Portugal Housing Crisis: పోర్చుగల్‌లో ఇళ్ల ధరలు, అద్దెలపై ఆగ్రహం.. 30కి పైగా నగరాల్లో భారీ నిరసనలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 15, 2026
01:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

పోర్చుగల్‌లో ఇళ్ల ధరలు, అద్దెలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తింది. దేశవ్యాప్తంగా 30కి పైగా నగరాలు, పట్టణాల్లో వేలాది మంది వీధుల్లోకి వచ్చి భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దేశ చరిత్రలో నివాస హక్కుల కోసం జరిగిన అతిపెద్ద ఆందోళనగా ఇది నిలిచింది. లిస్బన్, పోర్టో వంటి ప్రధాన నగరాల్లో విద్యార్థులు, యువత నుంచి పదవీ విరమణ చేసిన వృద్ధుల వరకు అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చారు. 'మా నివాస హక్కును లాక్కోనివ్వం', 'అద్దెలు తగ్గించండి.. వేతనాలు పెంచండి' అంటూ నినాదాలు చేశారు.

వివరాలు

పదేళ్లలో 61 శాతం పెరిగిన ఇళ్ల ధరలు

యూరోస్టాట్ గణాంకాల ప్రకారం.. 2015 నుంచి 2025 మధ్య పోర్చుగల్‌లో సాధారణ ప్రజల ఆదాయంతో పోలిస్తే ఇళ్ల ధరలు ఏకంగా 61 శాతం పెరిగాయి.

యూరోపియన్ యూనియన్‌లో ఇదే అత్యధిక పెరుగుదల కావడం గమనార్హం.

2025 తొలి త్రైమాసికం నుంచి 2026 తొలి త్రైమాసికం మధ్యే ఇళ్ల ధరలు దాదాపు 20 శాతం పెరిగాయని ఆ దేశ జాతీయ గణాంకాల సంస్థ వెల్లడించింది.

మరోవైపు 2020 నుంచి ఇప్పటివరకు అద్దెలు 68 శాతం పెరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

వివరాలు

విదేశీ పెట్టుబడులు, పర్యాటకంతో మరింత సంక్షోభం

విదేశీ కొనుగోలుదారులు, ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్, డిజిటల్ నోమాడ్స్ సంఖ్య పెరగడం పోర్చుగల్‌ గృహ సంక్షోభాన్ని తీవ్రతరం చేసింది.

పర్యాటకం కారణంగా ఇళ్లను స్వల్పకాలిక అద్దెలకు ఇవ్వడం కూడా సమస్యను మరింత పెంచింది.

దీనికితోడు అద్దెదారులను త్వరగా ఇళ్లు ఖాళీ చేయించేందుకు యజమానులకు వీలు కల్పించేలా ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త బిల్లు ప్రజల్లో ఆగ్రహాన్ని మరింత పెంచింది.

ADVERTISEMENT

వివరాలు

సంక్షోభం పరిష్కారానికి ప్రభుత్వ హామీ

ప్రజల ఆందోళనల నేపథ్యంలో పోర్చుగల్ అధ్యక్షుడు ఆంటోనియో జోస్ సెగురో ఉన్నత స్థాయి మండలితో సమావేశమై పరిస్థితిపై చర్చించారు.

కొందరు నిరసనకారులను కూడా ఆయన స్వయంగా కలిశారు. గృహ సంక్షోభాన్ని అదుపు చేసేందుకు కొత్త ఇళ్ల నిర్మాణాలకు పన్ను రాయితీలు కల్పించడంతో పాటు 1,45,000 ఇళ్లను నిర్మిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

అయితే ఈ చర్యల ఫలితాలు కనిపించడానికి కొంత సమయం పడుతుందని అధికారులు స్పష్టం చేశారు.

ADVERTISEMENT