ఉత్తర ఇరాక్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 113మందిమృతి, 150 మందికి గాయాలు
ఉత్తర ఇరాక్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఫంక్షన్ హాల్‌లో జరుగుతున్న వివాహ వేడుకలో ఈ ఘటన జరిగింది.113 మంది మరణించాగా,150 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యఆరోగ్యశాఖ అధికారులు బుధవారం తెలిపారు. ఇరాక్‌లోని నినెవే ప్రావిన్స్‌లోని హమ్దానియా ప్రాంతంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మంటలు చెలరేగడంతో పెళ్లి మండపంపై మంటలు ఎగసిపడుతున్నట్లు టెలివిజన్ ఫుటేజీలు చూపించాయి. ప్రధాన మంత్రి మహమ్మద్ షియా అల్-సుడానీ అగ్నిప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు. దేశంలో చట్టవిరుద్ధమైన మండే క్లాడింగ్‌తో పెళ్లి హాలు అలంకరించబడిందని ఇరాకీ న్యూస్ ఏజెన్సీ ఉటంకిస్తూ పౌర రక్షణ అధికారులు వివరించారు.