Page Loader
Iran: ఇరాక్‌లోని హైపర్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 50 మందికి పైగా మృతి
ఇరాక్‌లోని హైపర్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 50 మందికి పైగా మృతి

Iran: ఇరాక్‌లోని హైపర్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 50 మందికి పైగా మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2025
11:42 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాక్‌లోని షాపింగ్ మాల్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 50 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. ఇరాక్‌లోని ఆల్‌కుట్ ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మృతులలో ఎక్కువ మంది పిల్లలు,చిన్నారులే ఉన్నట్టు సమాచారం. సోషల్ మీడియాలో ప్రస్తుతానికి బయటపడిన దృశ్యాలలో షాపింగ్ మాల్‌లో ఎక్కువ భాగం మంటల్లో చిక్కుకున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఐదంతస్తులుగా ఉన్న ఈ షాపింగ్ మాల్‌లో జరిగిన ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా గుర్తించాల్సి ఉంది. ప్రాథమిక దర్యాప్తు వివరాలను 48గంటల్లో వెల్లడిస్తామని అక్కడి స్థానిక అధికార యంత్రాంగం తెలిపింది. ఈ ప్రమాదం నేపథ్యంలో సంబధిత భవనం యజమాని సహా షాపింగ్ మాల్ నిర్వాహకులపై పలు కేసులు నమోదు చేసినట్టు సమాచారం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇరాక్‌లోని హైపర్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం