Page Loader
Pak-Afghan : ఆఫ్ఘన్లకు పాకిస్థాన్ షాక్.. వలసవాదులను స్వదేశానికి తరలిస్తున్న పాక్
ఆఫ్ఘన్లకు పాకిస్థాన్ షాక్

Pak-Afghan : ఆఫ్ఘన్లకు పాకిస్థాన్ షాక్.. వలసవాదులను స్వదేశానికి తరలిస్తున్న పాక్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 02, 2023
05:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లో అక్రమంగా నివాసం ఉంటున్న ఆఫ్ఘనిస్థాన్ పౌరులకు పాక్ సర్కార్ షాక్ ఇచ్చింది. ఈ మేరకు వారిని స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. వలస వాదులను నియంత్రించే క్రమంలో డాక్యుమెంటేషన్ లేకుండా పాకిస్తాన్‌లో దాదాపు 2 మిలియన్ల మంది ఆఫ్ఘన్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వెంబడి చమన్ సరిహద్దు క్రాసింగ్ ఫ్రెండ్‌షిప్ గేట్ వద్ద, పత్రాలు లేని వలసదారులు దేశం వీడాలని పాక్ ఇదివరకే హెచ్చరించింది. పాకిస్థాన్ భద్రతా దళాలు బుధవారం, దేశంలో అక్రమంగా నివసిస్తున్న పదుల కొద్దీ ఆఫ్ఘన్‌లను నిర్బంధించారు.ఈ మేరకు తాజాగా బహిష్కరిస్తున్నారు. దీనిపై ఐక్యరాజ్య సమితి ఏజెన్సీలు, హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం పాక్ చర్యలను ఖండిస్తున్నట్లు తెలిపింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆఫ్ఘన్ వాసులను స్వదేశానికి తరలిస్తున్న పాక్ సర్కార్