
Pakistan: పాకిస్థాన్ లో ఎన్‌కౌంటర్.. ఆర్మీ కెప్టెన్ సహా 10 మంది ఉగ్రవాదుల మృతి
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఘర్షణ చోటు చేసుకుంది.ఈ ఘటనలో పాకిస్తాన్ ఆర్మీ కెప్టెన్ హస్నైన్ అక్తర్ సహా 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
భద్రతా దళాలు భారీ స్థాయిలో ఆయుధాలు,మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.
నిషేధిత సంస్థలకు చెందిన 10మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) వెల్లడించింది.
ఉగ్రవాదుల సంచారం ఉందన్న సమాచారంతో గురువారం నిఘా ఆధారిత ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు పాకిస్తాన్ సైనిక మీడియా విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ క్రమంలో తీవ్రమైన ఎదురుకాల్పులు జరిగాయి.ఆపరేషన్‌ను నడిపిస్తూ కెప్టెన్ హస్నైన్ అక్తర్ వీరమరణం పొందినట్లు వెల్లడించారు.
ఆయన అపార ధైర్యసాహసాలకు ప్రసిద్ధి చెందారని, దేశ రక్షణ కోసం నిస్వార్థంగా పోరాడిన ధీరుడని పాకిస్తాన్ సైన్యం పేర్కొంది.
వివరాలు
సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు
2021లో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి.
ఈ పరిణామాలతో పాక్ దళాలు తీవ్రస్థాయిలో ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాయి.
ముఖ్యంగా 2025 జనవరి నుంచి ఉగ్రదాడులు మరింత పెరిగాయని సైన్యం వెల్లడించింది.
ఈ ఉగ్రవాదులు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని పాకిస్తాన్ సైన్యం ఆరోపించింది.