పాక్ మామిడి పండ్ల వ్యాపారి నోట.. షకీరా వాకా వాకా పాట
ప్రముఖ పాప్ స్టార్ షకీరా పాట వాకా వాకా ఎంతలా జనాదరణ పొందిందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఇప్పుడా పాటనే వ్యాపారానికి పెట్టుబడిగా ఎంచుకున్నాడో మామిడి పండ్ల వ్యాపారి. వ్యాపారమేదైనా ప్రచారం సరిగ్గా లేకపోతే జనాల్లోకి విషయం చేరదు. పాకిస్తాన్ లోని అటాక్ నగరానికి వీధి వ్యాపారి వినియోగదారుల్ని అక్కున చేర్చుకునేందుకు షకీరా ఫేమస్ పాట వాకా వాకాను పాడుతూ వ్యాపారాన్ని లాభాసాటిగా మల్చుకుంటున్న తీరు నెట్టింట వైరల్ గా మారింది. వ్యాపారి వాకా వాకా పాటకు సామాజిక మాధ్యమాల్లోనూ నెటిజన్స్ స్పందిస్తున్నారు. షకీరా ఇన్ మల్టీవర్స్ అని ఒకరు, అది టాలెంట్ కాదు.. ఆత్మవిశ్వాసం అని మరొకరు కితాబిచ్చారు.