
Shehbaz Sharif: ఒక్క నీటి చుక్కా తీసుకోనివ్వం..భారత్‌పై పాక్ ప్రధాని ప్రేలాపన
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ ప్రధాన మంత్రి షహబాజ్ షరీఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ దేశానికి కేటాయించిన జలాలపై భారత్ ఒక్క చుక్క కూడా వినియోగించుకోనివ్వబోమని స్పష్టం చేశారు. ఏప్రిల్ 22న కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తరువాత భారత ప్రభుత్వం పాకిస్తాన్‌పై పలు ప్రతిస్పందనా చర్యలు చేపట్టింది. వాటిలో 1960లో కుదిరిన సింధూ జలాల ఒప్పందం (IWT) నుంచి వైదొలగడం కూడా ఉంది. ఆ నిర్ణయంతో భారత్ సింధూ నదీ జలాలను దిగువకు విడుదల చేయకుండా అడ్డుకుంది. ఈ పరిణామంపై ఇస్లామాబాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇలాంటి చర్యలు యుద్ధ నేరాలుగా పరిగణించబడతాయని ఆరోపించింది.
వివరాలు
బిలావల్ భుట్టో ఇదే తరహా ప్రేలాపనలు
ఈ సందర్భంలో మంగళవారం ఒక సమావేశంలో మాట్లాడిన షరీఫ్ .. "మా శత్రు దేశానికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. మా నీళ్లను ఆపుతామంటూ మీరు బెదిరిస్తున్నారు కదా. పాకిస్తాన్‌కు చెందాల్సిన ఒక్క నీటి చుక్కను కూడా మిమ్మల్ని తీసుకోనివ్వం. ఇది గుర్తుపెట్టుకోండి" అని హెచ్చరించారు. అంతేకాక, పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో కూడా సోమవారం ఇలాంటి ప్రేలాపనలే చేయడం గమనార్హం.