Page Loader
Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను CJCSC అరెస్టు..? 
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను CJCSC అరెస్టు..?

Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను CJCSC అరెస్టు..? 

వ్రాసిన వారు Sirish Praharaju
May 09, 2025
01:11 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్, భారత్ మధ్య యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. అనవసరంగా ఇండియాను గెలికిన పాకిస్తాన్, ఇప్పుడు నరకం అనుభవిస్తోంది. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ దేశాన్ని వదిలి పారిపోయే పరిస్థితి ఏర్పడింది. అలాగే, బలూచిస్తాన్ (BLA) కూడా దాడులు చేస్తోంది. ఈ పరిణామాలు చూస్తుంటే, పాకిస్తాన్ రెండు భాగాలుగా చీలే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే, ఈ పరిస్థతుల మధ్య పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ అరెస్టు అయ్యాడన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ, ఎవరు అతన్ని అరెస్టు చేసినట్లు క్లారిటీ లేదు.అయినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం అతడు అరెస్టు అయినట్లు వార్తలు వస్తున్నాయి.

వివరాలు 

సైనిక అధికారి‌గా జనరల్ సాహిర్ షంషాద్

అలాగే, పాకిస్తాన్ అతనిని ఆర్మీ చీఫ్ పదవికి తొలగించిందని కూడా వార్తలు వస్తున్నాయి. దీనితో, ప్రస్తుత జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ జనరల్ సాహిర్ షంషాద్ సైనిక అధికారి‌గా నియమించబడినట్లు సమాచారం అందుతోంది. ఈ వార్తలు నిజమైతే, యుద్ధం ముగిసిపోయినట్లే అని అనేక అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను CJCSC అరెస్టు..?